వచ్చే ఎన్నికలు ఇటు చంద్రబాబునాయుడుకైనా అటు జగన్మోహన్ రెడ్డికైనా జీవన్మరణ సమస్యే అనటంలో సందేహం లేదు. చంద్రబాబే గనుక మళ్ళీ గెలిస్తే జగన్ కు ఇబ్బందులు తప్పవు. బహుశా ఆ ప్రభావం పార్టీ మనుగడపైన కూడా పడే అవకాశం లేకపోలేదు. జగన్ గనుక అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా చంద్రబాబుకు బాగా దెబ్బ.
వచ్చే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధుల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మహన్ రెడ్డి సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలో ఐదు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి: పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల గురించి. రెండు: పోయిన ఎన్నికల్లో అభ్యర్ధుల ఓటమికి దారితీసిన కారణాలు, మూడు: రేపటి ఎన్నికల్లో అభ్యర్ధులు గెలవటానికి కావాల్సిన వనరులు, నాలుగు: ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్ధులు ఎవరైనా ఉన్నారా అన్న విషయంతో పాటు అదికార పార్టీపై ప్రజలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు అన్న అంశాలపై జగన్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే సర్వే మొదలైందట. జూలైలో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశానికి సర్వే పూర్తి చేసి నివేదికను అందించాలని జగన్ సర్వే సంస్ధను కోరినట్లు సమాచారం. తుది నివేదిక ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎంఎల్ఏల్లో కూడా కొందరి పనితీరు పట్ల జగన్ అంత సంతృప్తిగా ఉన్నట్లు కనబడటం లేదు.
వచ్చే ఎన్నికలు ఇటు చంద్రబాబునాయుడుకైనా అటు జగన్మోహన్ రెడ్డికైనా జీవన్మరణ సమస్యే అనటంలో సందేహం లేదు. చంద్రబాబే గనుక మళ్ళీ గెలిస్తే జగన్ కు ఇబ్బందులు తప్పవు. బహుశా ఆ ప్రభావం పార్టీ మనుగడపైన కూడా పడే అవకాశం లేకపోలేదు. జగన్ గనుక అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా చంద్రబాబుకు బాగా దెబ్బ. పార్టీకి తక్షణమే వచ్చే నష్టం ఏమీ లేనప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. అందుకనే వచ్చే ఎన్నికలను ఇద్దరు నేతలూ చాలా ప్రతిష్టగా తీసుకున్నారు.
అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంతో అభ్యర్ధుల ఎంపిక చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏమాత్రం మొహమాటాలకు తావులేకుండా ఎంపిక ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే సర్వేలు చేయించుకుంటున్నారు.
అవసరమైతే ఇతర పార్టీలకు చెందిన గట్టి నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారిని పోటీలోకి దింపాలని కూడా జగన్ ఇప్పటికే నిర్ణయించారు. ప్రాధమిక సమాచారం మేరకు సుమారు 40 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేరట. అటువంటి నియోజకవర్గాలపైనే ముందుగా జగన్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
