Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh: రాజ‌ధానిగా విశాఖ‌.. లైన్ క్లియ‌ర్ చేస్తున్న ఏపీ స‌ర్కారు !

Andhra Pradesh: ఆంధ‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అంశం ఇప్ప‌టికీ రాష్ట్రంలో వివాదాస్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కు మూడు రాజ‌ధానులను తెర‌మీద‌కు తీసుకురాగా.. ఇది కోర్టువ‌ర‌కు వెళ్ల‌డంతో ఆగిపోయింది. అయితే, ఏపీ రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నంకు లైన్ క్లియ‌ర్ చేసే విధంగా సీఎం జ‌గ‌న్ స‌ర్కారు ముందుకు సాగుతున్న‌ద‌ని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌భుత్వం జారీచేసిన ఉత్త‌ర్వులు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసే విధంగా ఉన్నాయి. 
 

Jagan clears decks for Vizag as capital
Author
Hyderabad, First Published Jan 28, 2022, 1:43 PM IST

Andhra Pradesh: ఆంధ‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అంశం ఇప్ప‌టికీ రాష్ట్రంలో వివాద‌స్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కు మూడు రాజ‌ధానులను తెర‌మీద‌కు తీసుకురాగా.. ఇది కోర్టువ‌ర‌కు వెళ్ల‌డంతో ఆగిపోయింది. అయితే, ఏపీ రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam)కు లైన్ క్లియ‌ర్ చేసే విధంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా స‌ర్కారు ముందుకు సాగుతున్న‌ద‌ని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌భుత్వం జారీచేసిన ఉత్త‌ర్వులు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసే విధంగా ఉన్నాయి. రాష్ట్ర రాజ‌ధాని విష‌యంలో ప‌క్కా ప్రణాళిక‌ల‌తోనే ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని స‌మాచారం. రాష్ట్ర రాజధానిగా విశాఖపట్టణాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ ( Y.S. Jagan Mohan Reddy) ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అటువంటి ప్రణాళిక ప్రస్తుత జిల్లాల పునర్నిర్మాణంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం అధికార పరిధిని తగ్గించ‌డం, అలాగే, పారిశ్రామిక క్లస్టర్, గిరిజన బెల్ట్‌ను వేరు చేయ‌డం దీనిలో భాగంగానే ఉంద‌ని తెలుస్తోంది. 

రాష్ట్ర రాజ‌ధాని తెలంగాణ‌లోని హైదరాబాద్ జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగానే గ్రేటర్ విశాఖపట్నం (Greater Visakhapatnam) ఉండే విధంగా ప్రణాళిక‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌ధాని ప్రాంతం గ్రేట‌ర్ విశాఖ ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో భాగమవుతుంది. అలాగే, రాష్ట్ర రాధానిగా ఉండాల్సిన అన్ని అర్హ‌త‌లు ఉండేలా స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిసింది. ఎందుకంటే ప్ర‌స్తుత జిల్లాల విభ‌జ‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే విశాఖప‌ట్నం రాజ‌ధానిగా మార‌డానికి అన్ని అర్హ‌త‌లు పొందుతుంది. దాని కాస్మోపాలిటన్ సంస్కృతితో పాటు తక్కువ స్థలం, అధిక జ‌న‌సాంద్ర‌త వంటి అంశాలు జోడీ కానున్నాయి.  వైకాపా స‌ర్కారు అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే రాష్ట్రంలో ఇదొక్కటే పెద్ద నగరం కానుంది.  విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని ఫార్మాస్యూటికల్ యూనిట్లు, ఇతర పరిశ్రమలతో సహా దాదాపు అన్ని పరిశ్రమలు భవిష్యత్తులో అనకాపల్లి జిల్లాలో భాగమవుతాయి.

అలాగే,  తూర్పు నౌకాదళ కమాండ్‌లోని కొన్ని భాగాలు కూడా అనకాపల్లి జిల్లాకు వెళ్తాయి. పాడేరు, అరకుతో సహా 11 ఏజెన్సీ మండలాల్లోని మొత్తం ఏజెన్సీ పరిధిని కూడా వేరు చేసి మరో కొత్త జిల్లా - అల్లూరి సీతారామరాజు జిల్లాకు మార్చనున్నారు. “కొత్త విశాఖపట్నంలో హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి కొన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు తప్ప ఇత‌ర పరిశ్రమలు లేవు. అయితే ఐటీ సెజ్ పూర్తిగా వైజాగ్ అధీనంలో ఉంటుంది. టూరిజం, ఐటీ దాని వృద్ధికి రెండు థ్రస్ట్ ప్రాంతాలుగా ఉంటాయి”అని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెషనల్ చెబుతున్నారు. దాదాపు 80 శాతం ఐటీ కంపెనీలు, 50 శాతం టూరిజం యూనిట్లు విశాఖ నగరం పరిధిలోకి వస్తాయి.

కొత్త విశాఖపట్నం జిల్లా వైశాల్యం 928 చ.కి.మీ. ప్రస్తుతం జీవీఎంసీ వైశాల్యం 682 చ.కి.మీ. జీవీఎంసీ ప‌రిధిలో మొత్తం 98 వార్డుల్లో దాదాపు 10 వార్డులు కొత్త అనకాపల్లి జిల్లా పరిధిలోకి వెళ్తాయి. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి మాట్లాడుతూ, “పద్మనాభం మిన‌హా, భీమిలి పరిధిలోని కొన్ని గ్రామాలు  ప్రస్తుతం జీవీఎంసీలో భాగం కాదు. కాకపోతే, ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ అధికార పరిధిని దాదాపు మొత్తం కవర్ చేస్తుంది. ప్రస్తుతానికి, మా వైపు నుండి లేవనెత్తడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు” అని అన్నారు. “మేము సికింద్రాబాద్-హైదరాబాద్ జంట నగరాల తరహాలో జీవీఎంసీలోని వార్డులను పునర్నిర్మించవచ్చు. హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్ లాగా, విశాఖపట్నం (Greater Visakhapatnam) ఇప్పుడు అత్యధిక జ‌న‌ సాంద్రత కలిగిన, రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా అవుతుంది” అని హరి వెంకటకుమారి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios