వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలను జగన్ మరోసారి వాయిదా వేశారు.
వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలను జగన్ మరోసారి వాయిదా వేశారు. వారం రోజుల క్రితం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని చెప్పిన జగన్.. ఆ తేదీని మార్చి 16వ తేదీకి వాయిదా వేశారు. మరి కాసేపట్లో జాబితా వెలువడుతుందని అందరూ భావించారు. ఇలోగా మళ్లీ జగన్ ట్విస్ట్ ఇచ్చారు.
మార్చి 17వ తేదీ ఆదివారం ఇడుపుల పాయలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ఇడుపులపాయంలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. ఆయన అక్కడి నుంచి విశాఖ పట్నం వెళ్లనున్నారు.
నెల్లిమర్ల, నర్సీపట్నం, పి.గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ ఇప్పటికే.. అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
