అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ సంస్థలకు అప్పగించడంలో చాలా రాజకీయం ఉందని మాజీ రాష్ట్ర  ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నారు.

మాజీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు అమరావతి లోగుట్టు రట్టు చేస్తానని హెచ్చరిస్తున్నారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నపుడే అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ సంస్థలకు ఇచ్చారు. సింగపూర్ సంస్థలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత శ్రద్ద వహించారో అందరికి తెలిసిందే. ఆయన సొంతంగా మూడు నాలుగు సార్లు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లారు. చర్చలు జరిపారు. ఇలాంటెదెపుడు, ఎక్కడా జరగదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టుల చర్చల్లో పాల్గొనదు. ఆ పనంతా అధికారులు చేస్తారు. దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సంస్థలతో చర్చలు జరిపారు. కాంట్రాక్ట్ (స్విస్ చాలెంజ్ ) పద్ధతి వారికి అనుకూలంగా రూపొందించారని విమర్శ ఉంది. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. చాలా విమర్శలొచ్చాయి. అయినా ముఖ్యమంత్రి లెక్క చేయలేదు. అమరావతి సింగపూర్ లా గా కడతానని ఈ సంస్థలకే అప్పచెప్పారు.

ఇదంతా జరుగుతున్నపుడు ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూకూడా కృష్ణారావు మౌనంగా ఉన్నారు. అపుడే నిరసన చెబుతూ రాజీనామా చేసి రావలసి ఉండింది. రాజీనామా చేయక పోవడమే కాదు, ఆ పైన బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని కూడా స్వీకరించారు. ఒక ఏడాది పని చేశారు. ఆపైన బాబు-రావు స్నేహం, ఏం జరిగిందో ఏమో, చెడిపోయింది. కృష్ణారావును ఉద్యోగం నుంచి తొలగించారు. దీనితో ఆయన అమరావతి గుట్టు రట్టు చేస్తానని హెచ్చరిస్తున్నారు. అనేక బహిరంగ లేఖలు రాశారు. అమరావతికి వ్యతిరేకంగా ఆయన పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తానంటున్నారు. 

ఏమయినా సరే,కృష్ణారావు ఆగ్రహవం వల్ల అమరావతి కుంభకోణం అనేది బయటకొస్తే సరి.

మొన్నామధ్య ఆయన కర్నూలులో మాట్లాడారు. రేపు అంటే బుధవారం (సెప్టెంబర్ 7)నాడు విజయవాడలో అమరావతి రాజకీయం మీద ఉపన్యాసం ఇస్తున్నారు. ఆయన ఈ సబ్జక్టును ‘ లెక్జికాన్ ఆప్ స్టేట్ క్రాప్ట్’అని సబ్జక్టు కింద మాట్లాడతారు. ఉదయం పదిగంటలకు గాంధీనగర్ లోని రోటరీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రీన్ సోల్జర్స్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.