టీటీడీ పదవి నుంచి తొలగించే అవకాశం ఐటీ సోదాలలో పట్టుబడిన శేఖర్ రెడ్డి

చెన్నైలో గురువారం ఆదాయపన్ను శాఖ చేసిన రైడ్ లో అడ్డంగా దొరికి పోయిన శేఖర్‌ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా కూడా ఉన్నారు. ఐటీ అధికారులు ఆయనతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసి100 కిలోల బంగారం,నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

పవిత్రమైన టీటీడీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలా ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికిపోవడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఇప్పుడు తమ్ముళ్ల ఒత్తడితో శేఖర్ రెడ్డిని టీటీడీ పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.