త్వరలో టిడిపి కీలక నిర్ణయం: కింజరాపు

First Published 2, Mar 2018, 12:28 PM IST
Is tdp taking crucial decision over central relations
Highlights
  • శుక్రవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగుదేశంపార్టీ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందా? కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం విషయంలో కానీ బిజెపితో పొత్తుల విషయంపై కావచ్చు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సమావేశం అనంతరం, శ్రీకాకుళం ఎంపి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.  కేంద్రమంత్రులు, ఎంపిలతో పాటు చంద్రబాబు కూడా అదే మూడ్ లో ఉన్నట్లు సమాచారం.

టీడీపీ ఎంపీల ఆందోళన తర్వాత కేంద్రంలో కదలిక కనిపించలేదన్నారు. కాగా  ప్రజలు, క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తున్న విషయం వాస్తవమేనన్నారు. అయితే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

loader