Asianet News TeluguAsianet News Telugu

టిడిపి డబల్ గేమ్ ?

  • టిడిపి ఎంపిలు స్పీకర్ పోడియంలోని వెల్ లోకి వెళ్ళి ఆందోళనలు చేయటంతోనే అనుమానాలు మొదలయ్యాయి.
Is tdp playing double game on confidence motion

కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై టిడిపి డబుల్ గేమ్ అడుతోందా? అన్న అనుమనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, సోమవారం ఉదయం అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన తర్వాత టిడిపి ఎంపిలు స్పీకర్ పోడియంలోని వెల్ లోకి వెళ్ళి ఆందోళనలు చేయటంతోనే అనుమానాలు మొదలయ్యాయి.

అసలు అవిశ్వాస తీర్మానంపై శుక్రవారమే చర్చ జరగాల్సుంది. అయితే, సభ ఆర్డర్లో లేదని, సభ్యులు ఆందోళన చేస్తున్నారంటూ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అంటే అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి చర్చ జరగకూడదనే అధికార బిజెపి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే స్పీకర్ కూడా నడుచుకుంటున్నారు. లేకపోతే అసెంబ్లీ కావచ్చు లేకపోతే పార్లమెంట్ కావచ్చు ఏరోజైనా సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయా?

సభలో ఆందోళనలు అన్న విషయాన్ని సాకుగా తీసుకుని సోమవారం ఉదయం కూడా స్పీకర్ సభను వాయిదా వేశారు. అటువంటిది తిరిగి సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు వెల్ లోకి వెళ్ళి ఆందోళనలు చేయటమేంటి? అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలంటే ఆందోళనలు చేస్తున్న ఇతర పార్టీల సభ్యులను శాంతపరచాలి. తమకు సహకరించమని కోరాలి. అంతేకానీ స్వయంగా టిడిపి సభ్యులే ఆందోళనలు చేస్తుంటే ఇతర పార్టీల సభ్యులు ఎందుకూరుకుంటారు? ఇక్కడే టిడిపి ఎంపిల వైఖరిపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios