వైసిపిలోకి టిడిపి నేత గండి బాబ్జి

is tdp leader gandi babji joining in ycp soon
Highlights

టిడిపిలో నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకుంటున్నాయ్.

టిడిపిలో నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకుంటున్నాయ్. త్వరలో విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్ఏ గండి బాబ్జి వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేసేట్లుగా జగన్ నుండి బాబ్జి హామీ కూడా పొందినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయ్. అందులో భాగంగానే బాబ్జి త్వరలో తన మద్దతుదారులతో విందు సమావేశం నిర్వహించనున్నారు. బహుశా 8వ తేదీన విందుండవచ్చని అంటున్నారు.

ఆత్మీయ పలకరింపు పేరిట ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బాబ్జీ వైసీపీలో చేరుతున్నారని పెందుర్తి నియోజకవర్గంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వర్గీయులు హడావిడిగా సమావేశం ఏర్పాటు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసిపిలోకి గండిని తీసుకురావటంలో నగర వైసీపీ ముఖ్య నేత ఒకరు మధ్యవర్తిత్వం వహించినట్టు చెబుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పరవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబ్జీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

ప్రస్తుతం టిడిపిలో ఉన్న బాబ్జికి సిట్టింగ్ ఎంఎల్ఏ బండారు సత్యనాారాయణమూర్తితో అస్సలు పడటం లేదు. అందుకనే తిరిగి వైసిపిలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.

loader