శివసేన పేరు మనకు కొత్తకాకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.  అటువంటిది ఇపుడు ఏకంగా ప్రతిపక్షాన్ని అందునా ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజాపై, చంద్రబాబునాయుడు సొంతజిల్లా చిత్తూరులోనే గళం విప్పటం మాత్రం ఆశ్చర్యమే.

శివసేన... మనకేం కొత్తకాదు. శివసేన పేరు వినగానే ముంబాయ్, మత రాజకీయాలు గుర్తుకు వస్తాయి. అటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో ఎంటరవ్వటం ఒకింత ఆశ్చర్యమే. అందులోనూ తిరుమల తిరుపతి దేవస్ధానం కేంద్రంగా రాజకీయాల్లోకి ఎంటరవ్వాలని చూస్తున్నట్లుంది. అందుకే తిరుమలలో రాజకీయాలు మాట్లాడుతున్న రోజాపై విరుచుకుపడుతోంది.

అసలే రాష్ట్రంలోని పార్టీలతో జనాలు అవస్తలు పడుతుంటే శివసేన ఎంటరైంది. అదికూడా ఎన్నికల వాతావరణం వేడిక్కెతున్న వేళ. రావటం రావడమే వైసీపీ ఎంఎల్ఏ రోజాపై విరుచుకుపడుతున్నది. ఎప్పుడైతే రోజాపై శివశసేన నాయకులు విమర్శలు మొదలుపెట్టారో టిడిపి నేతల్లో సంతోషం మొదలైంది.

శివసేన చిత్తూరు జిల్లా కన్వీనర్ ఓంకార్ మాట్లాడుతూ, రోజా తిరుమల పవిత్రను చెడగొడుతున్నారంటూ మండిపడ్డారు. ఆమె పబ్లిసిటీ కోసమే తిరుమలకు వచ్చినపుడల్లా మీడియాతో రాజకీయాలు మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేసారు. తిరుమలలో నోటిని అడ్డుపెట్టుకుని మాట్లాడాలని కూడా హెచ్చరించారు.

తిరుమల తిరుపతి దేవస్ధానం నిబంధనల ప్రకారం తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం నిషేధమని తెలిసీ రోజా చేస్తున్న వ్యాఖ్యలను మిగిలిన రాజకీయపార్టీలు ఖండించాలని చెప్పారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించటం గమనార్హం. రోజాపై చట్టపరంగా పోరాడుతారట. సరే ఈ వ్యాఖ్యలను రోజా ఖండించారనుకోండి అది వేరే సంగతి.

ఇంతవరకూ శివసేన మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైందన్న సంగతి తెలిసిందే. శివసేన పేరు మనకు కొత్తకాకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అటువంటిది ఇపుడు ఏకంగా ప్రతిపక్షాన్ని అందునా ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజాపై, చంద్రబాబునాయుడు సొంతజిల్లా చిత్తూరులోనే గళం విప్పటం మాత్రం ఆశ్చర్యమే. అంటే, రాష్ట్ర రాజకీయాల్లో కూడా శివసేన యాక్టివ్ పాత్ర పోషించాలని అనుకుంటోందో ఏమొ.