ప్రత్యేకహోదా కోసం పవన్ చేసే ఏ దీక్షైనా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతుందనటంలో సందేహం అక్కర్లేదు. అందుకే వైసీపీకి దగ్గరవ్వలానుకున్నారా అన్న అనుమానం వస్తంది. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే.
ప్రత్యేకహోదాపై పవన్ కల్యాణ్ మెల్లిగా వేడి పెంచుతున్నట్లే కనబడుతోంది. హోదాపై జనసేన ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో ‘ఆత్మగౌరవ దీక్ష’లు జరుగుతోంది. దీక్షలు ఎందుకంటే ప్రత్యేకహోదాపై తెలుగుదేశం మంత్రులు, ఎంపిలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా అట. ప్రత్యేకహోదా కావాలంటూ వైసీపీ, కాంగ్రెస్ ఎంపిలకు తోడుగా టిఆర్ఎస్, తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు మాట్లాడినా రాష్ట్రంలోని టిడిపి ఎంపిలు మాత్రం మాట్లాడలేదు. పైగా సభలోనే ఉంటే హోదాకు మద్దతుగా ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని అసలు సభ నుండి వెళ్ళిపోయారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట మాత్రంగా కూడా మాట్లాడలేదు.
వపన్ అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించం ద్వారా చంద్రబాబునాయుడుపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనబడుతోంది. ఇక్కడే చాలామందికి పవన్ వ్యూహం అర్ధం కావటం లేదు. ప్రత్యేకహోదాపై మాట్లాడటమన్నది చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అధినేత ఆదేశాల ప్రకారమే ఎంపిలు నడుచుకుంటున్నారు. ఈ విషయం పవన్ కు తెలీదా? మరి తెలిసీ చంద్రబాబును వదిలేసి కేంద్ర మంత్రులను, ఎంపిలను విమర్శించటంలో అర్ధమేమిటి?
పోనీ ప్రత్యేకహోదా సాధనపై పవన్ సీరియస్ గా ఏమన్నా కార్యాచరణ రూపొందించారా అంటే అదీ లేదు కదా? గడచిన మూడేళ్ళుగా హోదా కోసం దీక్షలు చేస్తున్నది, ఆందోళనలు చేస్తున్నది ఒక్క వైసీపీ మాత్రమే. ఇంతకాలం వైసీపీకి మాట మాత్రంగా కూడా పవన్ మద్దతు పలకలేదు. మొన్ననే వైసీపీ ఎంపిలకు మద్దతుగా పవన్ ట్వీట్లు ట్వీటారు. హోదాపై పార్లమెంట్ లో వైసీపీ ఎంపిల పనితీరును ప్రశంసించారు. దాంతో పవన్ వైసీపీ వైపు అడుగులేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్షలకు కూర్చుంటున్నారు. అంటే పవన్ ఆదేశాలు లేనిదే జనసేన దీక్షలకు దిగదు కదా? అంటే అర్ధమేమిటి? ప్రత్యేకహోదాపై జనాల్లో ఉన్న సెంటిమెంట్, చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను పవన్ పసిగట్టినట్లే కదా? ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు పవన్ చెప్పారు. జనాల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో పవన్ కు తెలీదా? ప్రత్యేకహోదా కోసం పవన్ చేసే ఏ దీక్షైనా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతుందనటంలో సందేహం అక్కర్లేదు. అందుకే వైసీపీకి దగ్గరవ్వలానుకున్నారా అన్న అనుమానం వస్తంది. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే.
