రాజధానికి డిజైన్లు అందిస్తున్న నార్మన్ ఫోస్టర్ కుడా మాకీ అసోసియేట్స్ కు పట్టిన గతి తప్పదా ? ఇపుడదే సందేహం అందరిలోనూ మొదలైంది. బాధ్యతలు అప్పగించేముందు మాకీ అసోసియేట్స్ ని చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు తదితరులు ఆకాశానికి ఎత్తేసారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఆర్కిటెక్టుల్లో మాకీ ఒకటన్నారు. అటువంటి ఆర్కిటెక్ట్ కంపెనీ అర్ధాంతరంగా ఎందుకని ఒప్పందం నుండి వైదొలగింది? మాకీకి ముందు ఓ ముగ్గురు ఆర్కిటెక్టులతో ప్రభుత్వం డిజైన్లు వేయించింది. గడచిన ఏడాదిలో ఫోస్టర్ సుమారు ఆరుసార్లు చంద్రబాబుతో సమావేశమై ఉంటారు. చాలా డిజైన్లే ఇచ్చారు.

రాజధానికి డిజైన్లు అందిస్తున్న నార్మన్ ఫోస్టర్ కుడా మాకీ అసోసియేట్స్ కు పట్టిన గతి తప్పదా ? ఇపుడదే సందేహం అందరిలోనూ మొదలైంది. రాజధానికి డిజైన్లు అందించే బాద్యతను చంద్రబాబునాయుడు జపాన్ కు చెందిన మాకీ అసోసియేట్స్ కు అప్పగించారు. అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ను ఏర్పాటు చేసి మరీ మాకీని తీసుకున్నారు. బాధ్యతలు అప్పగించేముందు మాకీ అసోసియేట్స్ ని చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు తదితరులు ఆకాశానికి ఎత్తేసారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఆర్కిటెక్టుల్లో మాకీ ఒకటన్నారు.

అటువంటి ఆర్కిటెక్ట్ కంపెనీ అర్ధాంతరంగా ఎందుకని ఒప్పందం నుండి వైదొలగింది? ఆ కంపెనీ అందించిన డిజైన్లు నచ్చకపోతే వేరే డిజైన్లు ఇవ్వమని అడగవచ్చు. అలాకాకుండా అర్ధాంతరంగా కాంట్రాక్ట్ నే రద్దు చేసుకున్నారంటే అర్ధేంటి? మాకీ అసోసియేట్స్ కు-చంద్రబాబుకు మధ్య ఎక్కడో తేడా వచ్చింది.

సరే, అదేంటో బయటకు స్పష్టంగా తెలీటం లేదనుకోండి అది వేరే సంగతి. ఎందుకంటే, కాంట్రాక్ట్ నుండి తప్పించిన తర్వాత అసోయేట్స్ యాజమాన్యం కేంద్రానికి, ఆర్కిటెక్టుల సంఘం జాతీయ కార్యవర్గానికి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో ప్రభుత్వం పరువు కొండవీటి వాగులో కలిసిపోయింది.

మాకీకి ముందు ఓ ముగ్గురు ఆర్కిటెక్టులతో ప్రభుత్వం డిజైన్లు వేయించింది. వాటిలో ఏ కంపెనీ ఇచ్చిన డిజైన్లు కూడా చంద్రబాబుకు నచ్చలేదు. బాగా పేరున్న కంపెనీలిచ్చిన డిజైన్లే ఎంతకీ నచ్చటం లేదంటే ఎక్కడో లోపం ఉన్నట్లే. తనకేమి కావాలో చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారా? లేక స్ధాయి తక్కువ ఆర్కిటెక్టులను ఎంపిక చేసి వారినే ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్టులుగా ప్రభుత్వం ప్రచారం చేస్తోందా? లేకపోతే ఈ రెండూ కాక మరేవైనా కారణాలున్నాయా? ఇపుడదే అర్ధం కావటం లేదు.

ప్రస్తుతానికి వస్తే బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ విషయమే తీసుకుందాం? గడచిన ఏడాదిలో ఫోస్టర్ సుమారు ఆరుసార్లు చంద్రబాబుతో సమావేశమై ఉంటారు. చాలా డిజైన్లే ఇచ్చారు. డిజైన్లు ఇచ్చిన ప్రతీసారి ఏదో ఒకటి మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా ఫోస్టర్ డిజైన్లను పట్టుకుని అమరావతికి వచ్చారు. ఇదే చివరాఖరు సమావేశమని, ఈనెల 30వ తేదీన శంకుస్ధాపన అనికూడా నిర్ణయించుకున్నారు. కానీ చివరికేమైంది? ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లు చంద్రబాబుకు నచ్చలేదు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. చంద్రబాబు వరస చూస్తుంటే నార్మన్ ఫాస్టర్ కూడా మాకీ అసోసియేట్స్ దారిలో నడవక తప్పదనే అనిపిస్తోంది.