గెలుపుపై టిడిపికి నమ్మకం లేదా?

First Published 6, Apr 2018, 1:57 PM IST
is niadu skeptical of MPs win in by elections
Highlights
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనుకోవాల్సొస్తోంది.

రాజీనామాలు చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేకనే టిడిపి ఎంపిలు రాజీనామాలు చేయటం లేదాజరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనుకోవాల్సొస్తోంది.

ప్రత్యేకహోదా డిమాండ్ తో ప్రతిపక్ష వైసిపి ఎంపిలే రాజీనామాలు చేసినపుడు అధికారంలో ఉన్న టిడిపి ఎంపిలు ఎందుకు జంకుతున్నారు?

టిడిపి ఎంపిల విషయాన్ని జగన్ ఎన్నిసార్లు ప్రస్తావించినా చంద్రబాబు సవాలుగా ఎందుకు తీసుకోవటం లేదు? ఉపఎన్నికల్లో ఎంపిలను గెలిపించుకోవటమంటే ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించినంత వీజీ కాదన్న విషయం చంద్రబాబుకు తెలుసు.

అందుకనే ఎంపిల చేత రాజీనామాలు చేయించటానికి వెనకాడుతున్నట్లున్నారు. వైసిపి ఎంపిల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేరే విషయం. హోదా డిమాండ్ తో ఎంపిలు రాజీనామాలు చేశారనే మైలేజీ అయితే వైసిపికి వస్తుంది కదా?

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే ఏమవుతుందో ఏమో ఎవరూ చెప్పలేరు. అటువంటిది అధికారంలో ఉండి కూడా రాజీనామాలు చేయించటానికి చంద్రబాబు వెనకాడుతున్నారంటే కారణం అర్ధమైపోవట్లా?

 

loader