Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ పై మొహం చాటేసిన ‘దేశం’

బడ్జెట్ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబానాయుడు గానీ ఎంపిలు లేక ఇతర నేతలు రెచ్చిపోయి కేంద్రాన్ని మీడియా సమావేశాలు పెట్టి మరీ తిట్టేవారు.

Is naidu unhappy over budget allocations

 

 

కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. బడ్జెట్ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబానాయుడు గానీ ఎంపిలు లేక ఇతర నేతలు రెచ్చిపోయి కేంద్రాన్ని మీడియా సమావేశాలు పెట్టి మరీ తిట్టేవారు. ఏపికి బడ్జెట్ లో ఎంతో కొంత ఇచ్చినా సరే ఆ విషయాలను వదిలేసి ఇవ్వని వాటి గురించే మాట్లాడేవారు. సిఎంలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని కేంద్రమంత్రులు, ఎంపిలను  దద్దమలన్నరోజులు ఎన్ని ఉన్నాయో.

 

మరి, అదే టిడిపి ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని రైతులకు క్యాపిటల్ గైన్స్ మినహాయింపు తప్ప రాష్ట్రానికి మరో ప్రయోజనం కనబడలేదు. ప్రత్యేక రైల్వే జోన్ ఊసే లేదు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు లాంటి అంశాల ప్రస్తావనే లేదు. అమరావతి ప్రాంతానికి రైల్ కనెక్టివిటీ గురించి కూడా మాట్లాడలేదు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, గుంతకల్ స్టేషన్లలో ప్లాట్ ఫారాల పెంపునూ పట్టించుకోలేదు. మొత్తం మీద రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం మొండిచేయ్యే చూపిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.

 

ఇతరత్రా ఆదాయ ప్రయోజనాల విషయంలో కూడా కేంద్రం ఏపిని పూర్తిగా దెబ్బే కొట్టింది. రాష్ట్ర ఖజనాకు ఊరటనిచ్చే ప్రకటన ఏదీ లేదు. రెవిన్యూలోటు భర్తీ, పెట్టుబడులపై పన్ను రాయితీలు ఇలా అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్ళు చల్లేసింది. ప్యాకేజికి చట్టబద్దతపై ముఖ్యమంత్రి పదేపదే విజ్ఞప్తులు చేసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రాయితీలనే రాష్ట్రంలోని మరో 267 మండలాలకూ వర్తింపచేయాలని రాష్ట్రం చేస్తున్న విజ్ఞప్తులనూ కేంద్రం పట్టించ్చుకోలేదు.

 

హోలు మొత్తం మీద చూస్తే తాజా బడ్జెట్లో ఏపికి పూర్తి అన్యాయమే జరిగింది. చంద్రబాబు, కేంద్రంమంత్రులు, ఎంపిలు ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి బడ్జెట్ గురించి ఆహా ఓహో అనలేదంటేనే పరిస్ధితి అర్ధమైపోతోంది. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపిలు దద్దమలే. మరి ఇపుడు టిడిపి వాళ్లని ఏమనాలి? కేంద్రంపై పోరాటాలు చేస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు తాజా బడ్జెట్ గురించి ఏమంటారు?

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios