చంద్రబాబుకు తత్వం బోధపడింది

is Naidu taking U turn
Highlights

ప్రజల సహనానికి నెలాఖరే డెడ్ లైనని చంద్రబాబు హెచ్చరించటం దేనికి సంకేతాలో?

ఇన్ని రోజులూ క్యాష్ లెస్ లావాదేవీల గురించి మాట్లాడిన చంద్రబాబు హటాత్తుగా నగదు లభ్యత గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. నోట్ల రద్దు తర్వాత మొదలైన సమస్యలను అధిగమించాలంటే నగదు రహిత లావాదేవేలే మార్గమన్నారు.

 

అందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కూడా ప్రతీ రోజూ చంద్రబాబు అధికారులను ఊదరగొట్టటం అందరూ చూస్తున్నదే.

 

గడచిన కొద్ది రోజులుగా ఇ పాస్ అని, ఏపి పర్స్ అని, ఎం వ్యాలెట్ అని, స్వైపింగ్ మెషీన్లని, పిఒఎస్ అని ఏదేదో చెప్పిన చంద్రబాబుకు ఇపుడు తత్వం బోధపడుతున్నట్లుంది.  దశాబ్దాల తరబడి డబ్బు లావాదేవీలకు అలవాటు పడిన జనాలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్ళించటం అంత వీజీ కాదని అర్ధం అయినట్లుంది.

 

దానికితోడు రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రజల కష్టాలు, 2 వేల నోటు కోసం అర్ధరాతి నుండే బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న జనాలను చూసిన తర్వాత జనాల మైండ్ సెట్ అర్ధమైనట్లే ఉంది. ఎందుకంటే, 2 వేల కోసం బ్యాంకులు, ఏటిఎంల వద్ద ఘర్షణలు మొదలయ్యాయి. ఏటిఎం, బ్యాంకు శాఖలపై ప్రజలు దాడులు పెరిగిపోతున్నాయి.

 

దాంతో ఈ పరిస్ధితుల్లో కూడా తాను నగదు రహిత లావాదేవీల గురించి మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు గ్రహించినట్లున్నారు. అందుకనే ప్రజల సహనానికి పరీక్ష పెట్టవద్దంటూ హటాత్తుగా ఆర్బఐపై మండిపడ్డారు. ప్రజల సహనానికి నెలాఖరే డెడ్ లైనని చంద్రబాబు హెచ్చరించటం దేనికి సంకేతాలో?

 

ఏదో మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ప్రజలు వేచి చూస్తున్నారని కూడా అన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో  నెలకొన్న సమస్యలు, డబ్బులు చేతికి అందకపోవటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సిఎం ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఫోన్ లో వివరించారు. అన్నీ పనులూ వదులుకుని ప్రజలు డబ్బులకు ఎంత కష్టపడుతున్నదీ చూడమన్నారు.

 

 

loader