భాజపా నేతల సమాచారం ప్రకారం మార్పులు, చేర్పుల్లో చంద్రబాబు వ్యతిరేకులకు పెద్దపీట వేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వెంకయ్య ఖాళీ చేసిన రాజ్యసభ స్ధానంలో రామ్ మాధవ్ తో భర్తీ చేస్తారట. బహుశా కేంద్రక్యాబినెట్లోకి కూడా తీసుకోవచ్చు. మరో కీలక నేత పురంధేశ్వరిని కూడా త్వరలో రాజ్యసభ సభ్యురాలిని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలావుంటుందని జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం.
భారతీయ జనతా పార్టీలో ఏపికి సంబంధించి పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోతున్నాయా? అదికూడా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా మారుతున్నాయా? అన్న సందేహాలు మొదలయ్యాయి. బాజపాలో జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో కీలక నేతగా దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల నుండి పక్కకు పోగానే ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం. భాజపా నేతల సమాచారం ప్రకారం మార్పులు, చేర్పుల్లో చంద్రబాబు వ్యతిరేకులకు పెద్దపీట వేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రస్ధాయిలో సోమువీర్రాజుకు అధ్యక్ష పదవి అప్పగిస్తారంటూ ప్రచారం ఊపందుకున్నది. వీర్రాజు చంద్రబాబుకు పూర్తి వ్యతిరేక బృందంలోని కీలకనేతల్లో ఒకరిగా ముద్రపడిన సంగతి తెలిసిందే కదా? ఇంతకాలం వెంకయ్యనాయుడున్నారు కాబట్టి వీర్రాజుకు పగ్గాలు పడుతున్నాయన్నది వాస్తవం. ఇక, జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ కు కూడా ఉభయ రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వెంకయ్య ఖాళీ చేసిన రాజ్యసభ స్ధానంలో రామ్ మాధవ్ తో భర్తీ చేస్తారట. బహుశా కేంద్రక్యాబినెట్లోకి కూడా తీసుకోవచ్చు.
అదేవిధంగా, మరో కీలక నేత పురంధేశ్వరిని కూడా త్వరలో రాజ్యసభ సభ్యురాలిని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలావుంటుందని జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అంటే రామ్ మాధవ్ అయినా పురంధేశ్వరి అయినా చంద్రబాబు వ్యతిరేకులుగా ముద్రపడ్డవారే అన్న విషయం తెలిసిందే కదా? జరుగుతున్న ప్రచారం గనుక వాస్తవరూపంలోకి వస్తే చంద్రబాబుకు భవిష్యత్తులో సమస్యలు ఖాయం. అపుడు వచ్చే ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీ చేసేది ఇక కల్లే అనుకోవచ్చు.
ఎప్పుడైతే, రెండు పార్టీలు విడిపోవాలని అనుకున్న మరుక్షణం నుండి చంద్రబాబబుకు సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే, చంద్రబాబుక పూర్తిస్ధాయిలో వెంకయ్య మద్దతు ఇస్తున్నారన్న విషయం తెలిసి కూడా రాష్ట్ర భాజపాలోని కీలకనేతల్లో కొందరు ఇద్దరిపైనా పూర్తి వ్యతిరేకంగా అనేక నివేదికలు అందచేసారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలంటూ ఎప్పటి నుండో బాహటంగానే డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే, జరుగుతున్న ప్రచారం చూస్తుంటే చంద్రబాబుపై కోపంతో మూడు సంవత్సరాల నుండి కాచుకుని కూర్చున్న వ్యతిరేక వర్గమంతా ఒక్కసారిగా రెచ్చిపోతారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తం మీద వెంకయ్య ఎగ్జిట్ తో చంద్రబాబుకు బ్యాడ్ టైం మొదలైనట్లే కనబడుతోంది.
