మూడేళ్ళల్లో ఎంఎల్ఏపై పెట్టిన కేసులన్నీ ప్రజాందోళనలకు సంబంధించినవే. తాజాగా సి రామాపురంలో చెత్త డంపింగ్ యార్డు తరలింపు ఆందోళనలో కూడా ఎంఎల్ఏపై కేసు పెట్టి కోర్టుకు తరలించారు. సరే, కోర్టులో బెయిల్  వచ్చిందనుకోండి. ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి జనాలకు ఏమీ చేయలేను అని అనకుండా నిత్యమూ జనల్లోనే ఉంటున్నారు,

కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే, వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న ఆందోళనల కారణంగా. చెవిరెడ్డి ఆందోళనలు చేయటం, పోలీసులు అరెస్టులు చేయటం సాధారణమైపోయింది. కొన్నిసార్లు రిమాండుకు కూడా పంపుతున్నారనుకోండి అది వేరే సంగతి. గడచిన మూడేళ్ళల్లో చెవిరెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు అరెస్టులు చేసారు, రిమాండుకు పంపారో లెక్కేలేదు.

ఇంతకీ చెవిరెడ్డిపై పోలీసులు ఎందుకని అన్ని కేసులు పెట్టారు? అన్ని సార్లు రిమాండుక పంపారో అర్దం కావటం లేదు. ఎంఎల్ఏపైన ఏమీ దొమ్మీ కేసులు లేవు. ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొన్న నేపధ్యమూ లేదు. పోలీసులు ఎంత విచిత్రంగా వ్యవహరిస్తున్నారంటే, ఒక కేసులో చెవిరెడ్డి బెయిలుపై రామాండ్ నుండి బయటకు రాగానే ఇంకో కేసులో వెంటనే అరెస్టు చేసి మళ్ళీ రిమాండుకు తరలించిన ఘటనలున్నాయి.

చూడబోతే చెవిరెడ్డిని అధికారపార్టీ లక్ష్యంగా చేసుకున్నట్లే కనబడుతోంది. అధికారపార్టీ ఆదేశాలు లేకపోతే పోలీసులు మాత్రం ఓ ఎంఎల్ఏపై ఎందుకు కేసులు పెడతారు? ఇక్కడ చంద్రగిరేమో స్వయానా చంద్రబాబు సొంత నియోజకవర్గం. చంద్రగిరిని దశాబ్దాల క్రితమే చంద్రబాబు ఖాళీ చేసేసాడనుకోండి అదివేరే సంగతి. సరే, ఎక్కడ నుండి పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గమేదంటే చంద్రగిరి అనే చెబుతారు కదా?

పోనీ చంద్రగిరిలో ఏమైనా టిడిపి నేతలు యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు. వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి హడావుడే ఎక్కువుగా ఉంది. ఆ హడావుడినే బహుశా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకే చెవిరెడ్డి తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారు. అయితే, ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది.

మూడేళ్ళల్లో ఎంఎల్ఏపై పెట్టిన కేసులన్నీ ప్రజాందోళనలకు సంబంధించినవే. తాజాగా సి రామాపురంలో చెత్త డంపింగ్ యార్డు తరలింపు ఆందోళనలో కూడా ఎంఎల్ఏపై కేసు పెట్టి కోర్టుకు తరలించారు. సరే, కోర్టులో బెయిల్ వచ్చిందనుకోండి. ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి జనాలకు ఏమీ చేయలేను అని అనకుండా నిత్యమూ జనల్లోనే ఉంటున్నారు, అది కూడా ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. జనాలకు ఇంతకన్నా ఇంకేం కావాలి. అంటే చంద్రబాబే ఎంఎల్ఏని ఒకవిధంగా హీరోని చేస్తున్నట్లు లేదు?