Asianet News TeluguAsianet News Telugu

ఓట్ల కోసమే ఈ హడావుడా?

కేవలం రానున్న ఎన్నికల కోసమే రాజధాని నిర్మాణ ప్రక్రియను హడావుడిగా ప్రారభించినట్లున్నారు. అధికారంలోకి వచ్చే మూడేళ్లవుతున్నా ఇంత వరకూ రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు. దాంతో జనాల్లో నవ్వుల పాలవుతున్నది ప్రభుత్వం.

Is Naidu making hungama to face next elections

కేవలం రానున్న ఎన్నికల కోసమే రాజధాని నిర్మాణ ప్రక్రియను హడావుడిగా ప్రారభించినట్లున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇంత వరకూ రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు. దాంతో జనాల్లో నవ్వుల పాలవుతున్నది ప్రభుత్వం. పోయిన ఎన్నికల్లో తనకున్న అనుభవం, రాజధాని నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించటం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారు. జనాలు కూడా అప్పట్లో నిజమనే అనుకున్నారు. అయితే, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నది వేరేగా ఉంది.

రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. భూసమీకరణ సందర్భంగా కొందరు మంత్రులు, నేతలు చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు సొంతం చేసుకోవటంతో చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వెలుగుచూసాయి. రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం మొదలైపోయింది. జరుగుతున్న అనేక పరిణామాలు కూడా దానికితగ్గట్లే ఉన్నాయి.

ప్రధానమంత్రి శంకుస్ధాపన చేసిన తర్వాత అనేకమార్లు శంకుస్ధాపనలు జరిగాయి. అంతేకాకుండా ఎవరికీ అర్ధంకాని రీతిలో స్టార్టప్ అని, 9 రకాల సిటీలని రకరకాల పేర్లు పెట్టటం కూడా జనాల్లో అయోమయం నెలకొంది. సరే జరుగుతున్నదేమైనా రాజధాని నిర్మాణం ముసుగులో పెద్ద ఎత్తున పలువురు భారీ అవినీతికి తెరలేపారని జనాలు నమ్ముతున్నారు. దాంతో చంద్రబాబుపై భ్రమలు తొలుగుతున్నాయి. దాంతో సిఎంలో ఆందోళన మొదలైంది.

దానికితోడు ఎన్నికలూ దగ్గర పడుతున్నాయి. దానికితోడు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న ఊహాగానాలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. గడచిన మూడేళ్ళలో నిర్దిష్టంగా చేసిన అభివృద్ధి ఇది అని ఒక్కటి కూడా చెప్పుకోలేకున్నారు. పట్టిసీమ నిర్మించినా అందులోనూ భారీగా అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు ‘కాగ్’ నివేదికే బయటపెట్టింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి. లేకపోతే ఓట్లు వేయరు.

కాబట్టి హడావుడిగా రాజధాని పరిధిలో స్టార్టప్ ఏరియా నిర్మాణం అంటూ మొదలుపెట్టారు. అందుకే ఎన్నికల్లోపు ఎంతో కొంత పురోగతిని చూపండంటూ సింగపూర్ కన్షార్షియంను వేడుకుంటున్నారు. నిజానికి సింగపూర్ వాళ్ళు కట్టే స్టార్టప్ ఏరియా అభివృద్ధి రాజధాని అయితే కాదు. ఎందుకంటే, సింగపూర్ కంపెనీలు కమర్షియల్ భవనాలు తప్ప అసెబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజభవన్ లాంటి ప్రభుత్వ భవనాలేవీ కట్టటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios