Asianet News TeluguAsianet News Telugu

మన ఎంపిల విషయంలో మోడి సీరియస్

  • ఆంధ్రప్రదేశ్ ఎంపిల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా సీరియస్ గా ఉన్నారా?
  • అందుబాటులోని సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది.
Is Modi very serious about AP MPs over village adoption scheme

ఆంధ్రప్రదేశ్ ఎంపిల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా సీరియస్ గా ఉన్నారా? అందుబాటులోని సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ఎందుకంటే, ప్రతి ఎంపి తన పార్లమెంటు నియోజకవర్గంలోని మూడు గ్రమాలను దత్తత తీసుకోవాలన్న ప్రధాని ఆదేశాలను రాష్ట్రంలోని చాలామంది ఎంపిలు లెక్కే చేయలేదు. అంటే, ఇది ఒక్క ఏపికి సంబంధించిన సమస్య మాత్రమే కాదులేండి. పొరుగు రాష్ట్రం తెలంగాణాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఎంపిలు కూడా ప్రధాని ఆదేశాలను పట్టించుకోలేదట.  అయితే ఏపి విషయంలోనే ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారంటే ఇక్కడున్నది మిత్రపక్షం కాబట్టి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి బాగా అలుసైపోయింది కదా? అందుకే పిఎంవో నుండి ఏపి ఎంపిలకు లేఖలు అందుతున్నాయట.

రాష్ట్రంలో  25 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో 12  మంది మాత్రమే స్పందించారు. వీరిలో ముగ్గురు వైసీపీ ఎంపిలు, ఒక కాంగ్రెస్ ఎంపి ఉండగా మిగిలిన వారు టిడిపి ఎంపిలు. గ్రామాల దత్తత స్కీంను ప్రవేశపెట్టినపుడు పలువురు ఎంపిలు ఆశక్తి చూపారు. ఎందుకంటే, బాగా నిధులు వస్తాయి కదా అని. అయితే, ఇపుడు ఇస్తున్న ఎంపి ల్యాడ్ ఫండ్లతోనే దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు  చేయాలని ప్రధాని స్పష్టం చేశారు. దాంతో ఎంపిలందరూ వెనక్కుతగ్గారు.

మూడు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మిగిలిన గ్రామాల ప్రజలతో తమకు సమస్యలు వస్తాయని చాలామంది ఎంపిలు వాదిస్తున్నారు. అయితే, వీరి వాదనతో పిఎంవో అంగీకరించటం లేదు. ప్రధాని ఆదేశాలను పాటించాల్సిందేనంటూ తన లేఖల్లో పిఎంవో స్పష్టం చేస్తోంది. మోడి ఆదేశాలను ప్రతీ ఎంపి పాటించాల్సిందేనని చెబుతున్న పిఎంవో పాటించని ఎంపిల విషయంలో ఏం చేస్తుందో మాత్రం చెప్పటం లేదు. కాగా దత్తత తీసుకున్న ఎంపిల్లో టి సుబ్బరామిరెడ్డి, టిజి వెంకటేష్, హరిబాబు, కొత్తపల్లి గీత, మురళీ మోహన్, రవీంద్రబాబు, అశోక్ గజపతిరాజు, అవంతి శ్రీనివాస్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం,, వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రమే మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios