చంద్రబాబుకు మోడి షాక్ ?

చంద్రబాబుకు మోడి షాక్ ?

మొన్నటి భేటీలో చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి షాకిచ్చారా ? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు. భేటి గురించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని-చంద్రబాబు భేటీలో మోడి పెద్ద షాక్ ఇచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ వర్గాల ద్వారా తనకందిన సమాచారం ప్రకారం మోడి షాక్ నుండి తేరుకోలేని చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా వెనక్కు తిరిగి వచ్చేసారట. ఇంతకీ మోడి ఇచ్చిన షాక్ ఏమిటి?

ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో ఏపిలోని లోక్ సభ స్దానాలన్నీ భారతీయ జనతా పార్టీకి అప్పగించి శాసనసభ స్ధానాల్లో మాత్రం టిడిపి పోటీ చేయాలని మోడి ప్రతిపాదించారట. దాంతో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలినట్లు ఉండవల్లి అభిప్రాయపడ్డారు. తాను ఒకందుకు వెళితే, మోడి ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేని చంద్రబాబు ప్రధాని ప్రతిపాదనపై ‘ఆలోచించుకుని చెబుతాను’ అని చెప్పి బయటకు వచ్చేసారు అని ఉండవల్లి పెద్ద బాంబే పేల్చారు.

భేటీ విషయమై ఉండవల్లి మాట్లాడుతూ, చంద్రబాబు ఎందుకో మోడి ముందు చతికిలపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల వల్ల ఏపిలో ప్రజల జీవనం చాలా ఖరీదైపోతున్నట్లు మండిపడ్డారు. తమిళనాడు, కర్నాటకలతో పోలిస్తే ఏపిలో డీజల్ ధర లీటర్ ఏడు రూపాయలు అధికంగా ఉందని చెప్పారు. అప్పుల వల్ల ఏపిలో ప్రజల జీవనవ్యయం చాలా కాస్ట్లీ అయిపోతోందన్నారు.

న్యాయవ్యవస్ధపై రాజకీయ జోక్యం లేకపోతే జగన్ కేసు నిలబడే అవకాశం లేదన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మోతాదుకు మించి హామీలు ఇస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాయలు చేయటానికి అలవాటు పడ్డారని చెప్పారు. చంద్రబాబు మాటల్లో నిజాయితీ కనిపించటం లేదని కూడా ఉండవల్లి తెలిపారు.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page