Asianet News TeluguAsianet News Telugu

మరోసారి దెబ్బకొట్టిన మోడి..చంద్రబాబుకు షాక్

  • రాజకీయంగా కూడా బిజెపి చంద్రబాబును ఇరుకునపెట్టే ఆలోచనలోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
Is modi developed personnel grudge on chandrababu

చూడబోతే చంద్రబాబునాయుడుపై కోసితోనే ఏపిని ప్రధానమంత్రి దెబ్బకొడుతున్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయంగా కూడా బిజెపి చంద్రబాబును ఇరుకునపెట్టే ఆలోచనలోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పొమ్మనకుండా టిడిపిని ఎన్డీఏలో నుండి బయటకు పొమ్మని చెప్పినట్లుంది బిజెపి వైఖరి. తాజాగా జరిగిన ఓ పరిణామమమే అందరి అనుమానాలకు ఊతమిస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ అభివృద్ధికి ప్రధానమంత్రి ఏకంగా రూ. 20 వేల కోట్ల ప్యాకేజి ప్రకటించారు. అంతేకాకుండా రక్షణ రంగ పారిశ్రామిక క్యారిడార్ ను కూడా ప్రకటించారు. ప్రధాని తాజా ప్రకటన చూస్తుంటే ఏపిలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలను ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత ఇటు రాష్ట్రంలో జనాలు, రాజకీయపార్టీలు అటు పార్లమెంటులోను ఎంపిలు చేస్తున్న రచ్చ అందరికీ తెలిసిందే. బడ్జెట్లో ఏపి ప్రయోజనాల విషయంలో కనీస ప్రస్తావన కూడా లేకపోవటంపై జనాలు మండిపోతున్నారు. ఇంత గొడవ జరుగుతున్న కేంద్రం ఏమాత్రం ఏపిని లెక్క చేయలేదు. పైగా తాజాగా బుందేల్ ఖండ్ కు ప్రకటించిన ప్యాకేజిని చూస్తే ఏపి జనాలకు ‘పుండుపై కారం రాసినట్లుం’ది.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబును నరేంద్రమోడి ఏమాత్రం ఖాతరు చేయటం లేదన్న విషయం స్పష్టమైపోయింది. ‘చంద్రబాబు దెబ్బకు కేంద్రం దిగొచ్చింద’ని, ‘ప్రధాని, అమిత్ షా లో కంగారు మొదలైంద’ని, ‘ఎటువంటి నిర్ణయం తీసుకొవద్దని అమిత్ షా, హోంశాఖ మంత్రి చంద్రబాబును బ్రతిమలాడుకుంటున్నార’ని పచ్చ మీడియాలో రాయించుకోవటం తప్ప అక్కడంత సీన్ లేదన్న విషయం జనాలకు అర్ధమైపోయింది.

చంద్రబాబు విషయంలో ప్రధానమంత్రి తన వైఖరేంటో చెప్పేసారు కాబట్టి పొత్తులపైన కావచ్చు, కేంద్రప్రభుత్వంలో కొనసాగే విషయంలో చంద్రబాబే నిర్ణయం తీసుకోవాల్సన పరిస్ధితులు ఏర్పడ్డాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios