నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే వరసలో తాజాగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు.

‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే వరసలో తాజాగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ పాదయాత్ర చేయాలి’ అంటూ హూంకరించారు. మంత్రి అన్న మాటల వెనుక అర్ధమేంటో?

ప్రతిపక్ష నేత జగన్ అసలు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేసారు. గడచిన మూడు నెలలుగా జగన్, వైసీపీ నేతలు చెబుతున్న కారణాలు బహుశా అచ్చెన్నకు అర్ధం కాలేదేమో. చంద్రబాబు పాలనలో జనాలంతా సంతోషంగా ఉన్నపుడు మళ్ళీ జగన్ పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీసారు.

జగనపై రాష్ట్రప్రజలకు విశ్వాసమే లేదని కూడా మంత్రి తేల్చేసారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ కోట్లు కూడబెట్టినట్లు ఆరోపించారు. సమస్యలేమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాలు విసిరారు.