రాయలసీమలోని రెడ్లను టిడిపిలోకి ఆకర్షించేందుకు సిఎం పథకం ప్రకారం వ్యవహరిస్తుండటం కూడా కెఇకి ఇబ్బందిగా మారింది
ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి మాటలకు అర్ధాలేమిటి? చంద్రబాబు వ్యవహార శైలిపై మంత్రిలో చాలా కాలంగా అసంతృప్తి పేరుకుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కెఇ మాట్లాడిన మాటలతో సర్వత్రా చర్చ మొదలైంది. చంద్రబాబుపై కెఇ నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లైంది.
జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో పెద్దగా పురోగతి లేదని కెఇ అంటున్నారు. జిల్లా కోసం ఏమి అడిగినా ఇస్తానని చెబుతున్నారే గానీ ఏవీ రావటం లేదని కెఇ అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్ధ తదతరాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేనన్నారు. ఇటువంటి విషయాలను కెఇ అనేకం ప్రస్తావించారు.జిల్లాకు రమ్మని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు రావటం లేదన్నారు. జిల్లాకు వస్తే ఏమి అడుగుతారోనని భయపడుతున్నట్లున్నారని కెఇ చురకలు వేసారు.
పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని కూడా కెఇ చెప్పుకున్నారు. తాను ఏమడిగినా ఎన్టీఆర్ కాదనకుండా వెంటనే మంజూరు చేసేవారని చెప్పటం గమనార్హం. కెఇ అసందర్భంగా మాట్లాడినా మాట్లాడిన మాటల్లో నిజముందని పార్టీ నేతలంటున్నారు.
రాయలసీమలోని రెడ్లను టిడిపిలోకి ఆకర్షించేందుకు సిఎం పథకం ప్రకారం వ్యవహరిస్తుండటం కూడా కెఇకి ఇబ్బందిగా మారింది. భూమా నాగిరెడ్డి, ఎస్ వి సుబ్బారెడ్డి కుటుంబాలను కెఇకి ఇష్టం లేకపోయినా చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు.
నంద్యాలకు చెందిన పై ఇద్దరు కర్నూలు పార్లమెంట్ లోని అన్నీ అసెంబ్లీ స్ధానాల్లో పట్టు పెంచుకుంటున్నారు. ఆ విషయంలోనే కెఇ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చంద్రబాబు-కెఇ మధ్య గ్యాప్ పెరగటానికి ఇది కూడా ఓ కారణం. ఓ విధంగా కెఇ మంత్రిగా ఉన్నారంటే ఉన్నారంతే. అదికూడా బిసి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి మంత్రివర్గంలో కొనసాగుతున్నారేమో.
మంత్రివర్గంలోని అందరికన్నా సీనియారైన తనను సిఎం సరిగా ఉపయోగింకోవటం లేదన్న అసంతృప్తి, లేదా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న ఆక్రోసం కెఇలో కనిపిస్తోంది. కెఇ ఇపుడు మాట్లాడిన మాటలు భవిష్యత్తులో దేనికి సంకేతాలో...
