Asianet News TeluguAsianet News Telugu

భాజపా మంత్రులు అసమర్ధులా?

మంత్రుల్లో అసమర్ధులుగాను, అవినీతిపరులుగాను చాలామందే ముద్ర వేయించుకున్నా తాజాగా వీరిపైనే చర్చ జరుగుతోంది.

Is bjp ministers inefficient in naidus ministry

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని భాజపా మంత్రులు అసమర్ధులా? లేక అలా అని ముద్ర వేస్తున్నారా? వాస్తవాలేంటో స్పష్టంగా తెలీదు కానీ విషయం అయితే దాదాపు అదే. మంత్రివర్గంలో భాజపా తరపున వైద్య, ఆరోగ్య శాఖను కామినేని శ్రీనివాసరావు, దేవాదాయశాఖను పైడికొండల మాణిక్యాలరావు నిర్వహిస్తున్నారు. మంత్రుల్లో అసమర్ధులుగాను, అవినీతిపరులుగాను చాలామందే ముద్ర వేయించుకున్నా తాజాగా వీరిపైనే చర్చ జరుగుతోంది.

మంత్రివర్గంలోని ఇతరులపై లేని చర్చ ఇపుడు వీరిపైనే ఎందుకన్నదే ఎవరికీ అంతుపట్టటం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ భాగోతాలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, కామినేని మంత్రి పదవిని బాధ్యతగా కాకుండా కేవలం అధికారాన్నిఅనుభవించటానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. శాఖపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, అక్రమాలు జరిగినట్లు బయటపడినా ఏమాత్రం నియంత్రించలేకపోతున్నారు.

కామినేని కేవలం ప్రోటోకాల్ కు మాత్రమే పరిమితమైపోయారు. దాంతో ఉన్నతాధికారులదే ఇష్టారాజ్యంగా తయారైంది. దానికి తోడు క్రిందిస్ధాయి అధికారులతో కూడా నేరుగా చంద్రబాబే ప్రతీరోజూ మాట్లాడేస్తుండటంతో నిజంగా మంత్రులకు పని కూడా ఉండటం లేదు. దాంతో కామినేని మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు.

అదేవిధంగా, దేవాదాయ శాఖమంత్రి పైడికొండలు కూడా కేవలం ప్రోటోకాల్ మాత్రమే అనుభవిస్తున్నారు. తాజాగా జిఏడి విడుదల చేసిన వివరాల ప్రకారం మంత్రి పేషిలో వందలాది ఫైళ్ళు నెలల తరబడి పేరుకుపోతున్నాయట. అంటే ఫైళ్ళు చూసే తీరిక కూడా లేకుండా మంత్రి ఏం చేస్తున్నారబ్బా?

సరే, అవినీతి ఆరోపణలు మామూలే అనుకోండి. పైగా మంత్రి-చంద్రబాబు మధ్య పెద్ద సఖ్యత కూడా లేదు. శాఖలోని కమీషనర్, ముఖ్య కార్యదర్శి, టిటిడి ఇఓ, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ఎవ్వరూ తన మాట వినటం లేదని, చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే వారిని ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి భాజపా నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios