మూడు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఢిల్లీ టూర్లో చంద్రబాబునాయుడుకు బిజెపి పెద్ద షాకే ఇచ్చిందా? అవుననే అంటున్నారు టిఎంసి ఎంపి డెరెక్ ఓ బ్రెయన్. మూడు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి.
అందుకనే మీడియా సమావేశాల ద్వారా తాను చెప్పదలచుకున్నది చెప్పాలనుకున్నారు. అందుకని మీడియా సమావేశాలు నిర్వహించారు. దానివల్ల పెద్దగా ఉపయోగం కనబడలేదు. అందుకని అప్పటికప్పుడు రూటు మార్చుకుని రెండు జాతీయ చానళ్ళకు చంద్రబాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
అయితే, ఇక్కడే చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే, ఇంటర్వ్యూలు చేసిన రెండు చానళ్ళు కూడా చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రసారం చేయలేదట. ఎందుకయ్యా అంటే, చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రసారం చేయవద్దని బిజెపి పెద్దలు యాజమాన్యాలపై ఆంక్షలు విధించారట. ఎంతకీ తన ఇంటర్వ్యూలు ప్రసారం కాకపోవటంతో ఆరాతీసిన చంద్రబాబుకు అసలు విషయం తెలిసి షాక్ తిన్నారట.
