Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధిగా ఆయనే .. చంద్రబాబు డిసైడ్ అయ్యారా..?

రాజధాని అమరావతి వున్న గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి పలువురు ఆసక్తి చూపుతున్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా టాక్. 

is Bhashyam Ramakrishna As Guntur TDP MP Candidate ksp
Author
First Published Feb 4, 2024, 9:18 PM IST

ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. టికెట్ల కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు దక్కనిపక్షంలో పార్టీ మారేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ పరిస్ధితి అన్ని పార్టీల్లోనూ నెలకొంది. ఇకపోతే.. రాజధాని అమరావతి వున్న గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి పలువురు ఆసక్తి చూపుతున్నారు.

టీడీపీ విషయానికి వస్తే.. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి సినీనటుడు మహేశ్ బాబు బావ, అమరరాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారనుకున్న సమయంలో గల్లా జయదేవ్ షాకిచ్చారు. తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా వుండాలని అనుకుంటున్నానని సభ పెట్టి మరి అనౌన్స్ చేశారు . 

జయదేవ్ నిర్ణయంతో ఇక్కడ మరోకరిని ఎంపిక చేయాల్సిన పరిస్ధితి నెలకొంది టీడీపీలో. రాజకీయంగా కీలకమైన గుంటూరు నుంచి పోటీకి చంద్రబాబుపై పలువురు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు అభ్యర్ధిని ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా టాక్. సామాజికంగా, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు టీడీపీని అంటిపెట్టుకుని వుండటంతో రామకృష్ణ వైపు చంద్రబాబు మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది. 

అన్నీ అనుకూలిస్తే గత ఎన్నికల్లోనే భాష్యం రామకృష్ణ ఎంపీగా పోటీ చేయాల్సింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్ క్యాన్స్ చేసి.. జయదేవ్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కానీ ఈసారి స్వయంగా జయదేవ్ ఎన్నికల బరిలోంచి తప్పుకోవడంతో రామకృష్ణకే టికెట్ కేటాయించాలని తెలుగుదేశం అధినేత ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. భాష్యం పేరమ్మ ట్రస్ట్ ద్వారా రామకృష్ణ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆయన రాక ద్వారా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను పిలిపించి మాట్లాడారు కూడా. మరి సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ నిజమా.. కాదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios