బాలకృష్ణ నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేసారని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గం నుండి బాలయ్య పోటీ చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తనకు ఇష్టం లేకున్నా పిఏ శేఖర్ చౌదరిని బలవంతంగా బయటకు పంపాల్సి వచ్చిన కోపం కూడా ఉందేమో
మామూలుగా రాజుగారి బామ్మర్ది అంటే చాలా పవర్ ఫుల్. కానీ ఇక్కడ అంత సీన్ ఉన్నట్లు కనబడటం లేదు. పైగా యువరాజుకు స్వయానా మేనమామ కమ్ మావగారు అయ్యుండి కూడా ఏ సమస్య కూడా పరిష్కరించలేకపోవటం చూస్తుంటే డైలాగులన్నీ సినిమాల్లో మాత్రమే అని స్పష్టమవుతోంది. అవును ఇదంతా నందమూరి బాలకృష్ణ గురించే. మంచినీటి సమస్య తీర్చాల్సిందిగా ఎంతా మొరపెట్టుకుంటున్నా ఎంఎల్ఏ పట్టించుకోకపోవటంతో హిందుపురం పట్టణంలోని మహిళలు వేల సంఖ్యలో నిరసనకు దిగారు. దాంతో టిడిపిలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పైగా దున్నపోతుల మీద బాలకృష్ణ, టిడిపి పేర్లు రాయటంతో నేతలకు తల కొట్టేసినట్లుగా ఉందని బాధపడిపోతున్నారు.
మామూలుగా ఎంఎల్ఏ అంటేనే నియోజకవర్గంలో పనులు చకచకా జరిగిపోతాయి. అటువంటిది చంద్రబాబునాయుడు బామ్మర్ది, లోకేష్ కు మావగారంటే ఇంకెంత స్పీడ్ గా పనులు జరగాలి. అటువంటిది నియోజకవర్గంలో మంచినీటి సమస్య కూడా పరిష్కారం కావటం లేదంటే అర్ధమేమిటి? బాలకృష్ణ నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేసారని స్పష్టమవుతోంది. బహుశా వచ్చే ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గం నుండి బాలయ్య పోటీ చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తనకు బాగా ఇష్టుడైన పిఏ శేఖర్ చౌదరిని బలవంతంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా నియోజకవర్గం నుండి బయటకు పంపాల్సి వచ్చిందన్న కోపం కూడా కలిసివుంటుందేమో.
మొత్తానికి బాలయ్య అసలు నియోజకవర్గం వైపు మాత్రం చూడటం లేదు. గడచిన ఐదు మాసాలుగా జనాలు మంచినీళ్ల కోసం ఎంత మొత్తుకుంటున్నా బాలయ్య ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ప్రతిపక్ష వైసీపీ అవకాశం తీసుకున్నది. అయితే, ప్రతిపక్షం కూడా ఊహించనంతగా, మండుటెండలను సైతం లెక్కచేయకుండా వేలాది మహిళలు స్పందించారంటేనే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
