Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు తీపి కబురు

  • రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించనుంది.
Is ap govt taking steps to fill up vacant posts by coming January

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించనుంది. మూడు రకాల ఉద్యోగ నియామకాలను భర్తీ చేయటానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దాదాపు 15 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరి మాసంలోగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయ పోస్టులతో పాటు ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల్లో అవకాశం ఉన్నవాటిని భర్తీ చేయనున్నది. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ నెలలోగా భర్తికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 14 యూనివర్సిటీల్లో కలిపి సుమారు 1400 పోస్టులు, దాదాపు 10 వేల ఉపాధ్యాయపోస్టుల లెక్క తేలింది. వీటిల్లో ఎన్నింటిని భర్తీ చేస్తుందో చూడాలి.

ఇక ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల లెక్కను కూడా ప్రభుత్వం విభాగాల ద్వారా తెప్పించుకుంటోంది. ఉన్న ఖాళీల లెక్క తేలితే మొత్తం భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. ఇంత హటాత్తుగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో లేకపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రభావం కూడా ఏమైనా ఉండుంటుందా?

Follow Us:
Download App:
  • android
  • ios