జగన్ ను దెబ్బ కొట్టడమే పవన్ లక్ష్యం

Is andhra looks inching towards triangular contest in 2019
Highlights

  • రాజకీయ సమీకరణలు చిత్ర విచిత్రంగా మ ారిపోతున్నాయి

రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం వైసిపి అధినేత చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పోరాటం చేయక తప్పేట్లు లేదు. ఎందుకంటే, గడచిన మూడు రోజులుగా పవన్ వైఖరి గమనిస్తున్న వాళ్ళకి అటువంటి అనుమానాలు రావటంలో తప్పేమీలేదు. విశాఖపట్నంలో పవన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోదంటూ స్పష్టంగా ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరటం లేదు.  అడుగడుగునా పవన్, చంద్రబాబును వెనకేసుకు రావటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

చంద్రబాబు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ప్రధానమైనది రాజధాని నిర్మాణం మొదలు కాకపోవటం. పోలవరం ప్రాజెక్టు ఒడిదుడుకులకు లోనవుతోంది. కేంద్రం నుండి పెద్దగా సాయం అందటం లేదు. అదే సమయంలో అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. జనాల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారం నిలుపుకోవటమన్నది చంద్రబాబుకూ చాలా అవసరం. అందుకు పవన్ ను తురుపుముక్కగా వాడుకోవాలని చంద్రబాబు భావించినట్లున్నారు. అందుకనే తాను తెర వెనకే ఉండి అవసరమైనప్పుడల్లా జగన్ కు వ్యతిరేకంగా పవన్ ను రంగంలోకి దింపుతున్నారు.

నిజానికి వచ్చే ఎన్నికలు ఇటు చంద్రబాబు అటు జగన్ ఇద్దరికీ చాలా కీలకం. అధికారాన్ని అందుకోవటానికి జగన్ ఎంత అవస్తలు పడుతున్నారో, అధికారాన్ని నిలుపుకోవటానికి చంద్రబాబు అంతకన్నా ఎక్కువే అవస్తలు పడుతున్నారు. మూడున్నరేళ్ళల్లో అనేక సమస్యలపై వైసిపి అసెంబ్లీ వేదికగా చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతేకాకుండా  ప్రతీ అంశంలోనూ వైసిపి ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తోంది.

కానీ, పవన్ కు అవేమీ కనబడ లేదు. రాష్ట్రంలో సమస్యలు పెరుగిపోతున్నాయంటే చంద్రబాబును నిలదీయాల్సింది పోయి విచిత్రంగా జగన్నే తప్పుపడుతున్నారు పవన్. మూడున్నరేళ్ళు అసెంబ్లీ వేదికగా సమస్యలపై వైసిపి చేసిన పోరాటాలేవీ పవన్ దృష్టిలో పడకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పరిస్ధితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ చంద్రబాబు, పవన్ ఇద్దరినీ ఎదుర్కోక తప్పేట్లు లేదు. ఒకవేళ పవన్ ఒంటరిగా ఎన్నికల్లోకి దిగినా అది జగన్ ను దెబ్బ కొట్టటానికే అవుతుంది కానీ మరోటి కాబోదు.  చంద్రబాబు, పవన్ ఒక్కటే అన్న విషయాన్ని జనాల్లోకి వైసిపి ఏ స్ధాయిలో తీసుకెళుతుంది అన్న దానిపైనే జగన్ సక్సెస్ ఆధారపడుంది.

 

loader