వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమేనా? జనాల్లో మిత్రపక్షాలకు ఆధరణ పడిపోయిందా? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా పుంజుకున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ తాజాగా జరిగిన ఓ సర్వే అవుననే సమాధానం ఇస్తోంది. ఇంతకీ సర్వే ఏమిటి? చేసిందెవరనేగా మీ సందేహం? అయితే ఇంకెదుకాలస్యం. చదివేయండి.

ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలోని జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక టివి దేశం మొత్తం మీద ఈమధ్యనే సర్వే జరిపింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపి సీట్లు వస్తాయి? అన్న అంశం ప్రధానంగా సర్వే జరిపింది. మిగిలిన దేశం సంగతి పక్కనబెడితే ఏపిలో మాత్రం ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయట.

ఆశ్చర్యకరమైన ఫలితాలకు మూడు ప్రధాన కారణాలున్నాయట. జనాల అభిప్రాయం ప్రకారం పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ గ్రాఫ్ బాగా పెరిగిందట. ఇక, రెండో కారణమేమిటంటే, ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి. ఇవి చాలవా వైసిపికి ఆధరణ పెరగటానికి. ఒకవైపు వైసిపి ఎంఎల్ఏలను లాక్కోవటం, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం లాంటి వాటివి కూడా జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుతోందట.

సరే, ఇక విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి 13 ఎంపి సీట్లు ఖాయమట. పోయిన ఎన్నికల్లో వచ్చింది 8 మాత్రమే. అదే సమయంలో మిత్రపక్షాలకు 12 సీట్లు మాత్రమే వస్తాయట. పోయిన ఎన్నికల్లో 17 సీట్లు గెలిచింది.

రిపబ్లిక్ టివి సర్వే గనుక నిజమే అయితే వైసిపి ఆధిక్యం ఎంపి సీట్లతోనే ఆగదు. ఎందుకంటే, ప్రతీ పార్లమెంటు పరిధిలోనూ 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. కనీసం నాలుగు అసెంబ్లీలో మంచి మెజారిటీ వస్తేనే ఏ పార్టీ అయినా ఎంపి సీటులో గెలుస్తుంది. ఈ లెక్కన వైసిపికి వస్తాయని అనుకుంటున్న 13 ఎంపి సీట్ల పరిధిలోనే కనీసం 52 అసెంబ్లీ సీట్లలో గెలవాలి. అలాగే, మిత్రపక్షాలు గెలుస్తాయని అనుకుంటున్న 12 ఎంపి సీట్ల పరిధిలో కనీసం 36 అసెంబ్లీ సీట్లలో వైసిపి గెలుస్తుందని అనుకుందాం. అంటే మొత్తం మీద 52+36 = 86  అసెంబ్లీ సీట్లలో వైసిపి గెలవాలి.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వైసిపి 86 సీట్లు గెలవటం ఖాయమనుకుంటే  గెలిచే సీట్లు 86తో ఆగదు. కనీసం 100 దాటుతుంది. అంటే రిపబ్లిక్ టివి సర్వే ప్రకారం జగన్ సిఎం అవ్వటం ఖాయమన్నమాటే. ఇదంతా ఎప్పుడు? టిడిపి, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తేనే.  అదే విడివిడిగా పోటీ చేస్తే ?