ప్రభుత్వానికి ఐపిఎస్ ల షాక్

ప్రభుత్వానికి ఐపిఎస్ ల షాక్

ప్రభుత్వానికి ఐపిఎస్ అధికారులు షాక్ ఇస్తున్నారు. మూడున్నరేళ్ళుగా ప్రభుత్వ తీరును గమనిస్తున్న ఉన్నతాధాకారుల్లో అత్యధికులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సంవత్సరాల తరబడి తమను అప్రాధాన్యత పోస్టుల్లోనే ఉంచేయటంతో పాటు అనర్హులకు ప్రభుత్వం బాగా ప్రధాన్యత ఇస్తుండటం చాలామంది సీనియర్ ఐపిఎస్ లో అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. పోస్టింగుల్లో ప్రధానంగా సామాజికవర్గమే కీలక పాత్ర పోషిస్తుండటం కూడా వీరికి మింగుడుపడటం లేదు.

మూడున్నరేళ్ళుగా వ్యవహారాలు గమనిస్తున్న చాలామంది ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేయటం కష్టమని నిర్ణయించుకున్నారు. అందుకనే కేంద్రసర్వీసుల్లోకి వెళ్ళిపోవటానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దానికితోడు కేంద్రంలోని కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వీరి ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపికి 145 మంది ఐపిఎస్ పోస్టులను కేటాయించింది. అయితే, క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నది మాత్రం 120 మంది మాత్రమే. అంటే 25 పోస్టులు కొరతుంది. అందులో కూడా 10 మంది కేంద్ర సర్వీసుల్లోకి మరో నలుగురు డిప్యుటేషన్ పై సెంట్రల్ విజిలెన్స్ లో పనిచేస్తున్నారు.  త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక స్ధానాల్లో ప్రతిభ ఆధారంగా కాకుండా సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పోస్టింగులు ఇస్తుండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos