Asianet News TeluguAsianet News Telugu

ఇంటింటికి టిడిపి: మంత్రులను నిలదీస్తున్న జనాలు

  • తెలుగుదేశంపార్టీ నిర్వహిస్తున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం పలు చోట్ల రాసాబాసగా మారుతోంది.
  • తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులను, మంత్రులను కొందరు నిలదీస్తుంటే సహించలేని నేతలు వారితో గొడవలకు దిగుతున్నారు.
  • దాంతో అవతలవాళ్ళు కుడా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో కార్యక్రమంలొ గందరగోళం చోటు చేసుకుంటోంది.
  • అనంతపురం, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అనేక ఘటనలు వెలుగు చూసాయి.
Intitiki tdp  creating mess among public and party workers

తెలుగుదేశంపార్టీ నిర్వహిస్తున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం పలు చోట్ల రాసాబాసగా మారుతోంది. తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులను, మంత్రులను కొందరు నిలదీస్తుంటే సహించలేని నేతలు వారితో గొడవలకు దిగుతున్నారు. దాంతో అవతలవాళ్ళు కుడా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో కార్యక్రమంలొ గందరగోళం చోటు చేసుకుంటోంది. అనంతపురం, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అనేక ఘటనలు వెలుగు చూసాయి.

కార్యక్రమం ఉద్దేశ్యమేమో, గడచిన మూడేళ్ళల్లో ప్రభుత్వం  చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించటం, అర్హులను గుర్తించి లబ్దిదారులుగా మార్చటం. కానీ జరగుతున్నది మాత్రం వేరే. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పుకుంటోంది. మరి, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన తర్వాత కుడా జనాలు ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇక్కడే అసలు సమస్య దాగుంది.

సమస్య ఎంటంటే, రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవటం తప్పు. ఎందుకంటే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లొ అధికశాతం లబ్దిదారులు కేవలం టిడిపి కార్యకర్తలే. అర్హులైన పేదల్లో చాలామంది కాళ్ళరిగేలా తిరుగుతున్నా పథకాలు అందటంలేదు. దాంతో వారంతా విసిగిపోతున్నారు. అధికారపార్టీలో ఎవరినడిగినా పట్టించుకోవటం లేదు కాబట్టే వారికి బాగా మంటగా ఉంది.

ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరినీ జనాల్లోకి వెళ్ళమన్నారు. ఎప్పుడైతే మంత్రులు, ఎంఎల్ఏలు జనాల్లోకి వెళుతున్నారో జనాలు నిలదీస్తున్నారు. దాంతో గొడవలవుతున్నాయి. మొన్న అనంతపురం రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని జనాలు నిలదీసారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకూ అదే పరిస్ధితి ఎదురైంది. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కుడా జనాలు నిలదీయటంతొ ఇబ్బంది పడ్డారు. ఇక ఎంఎల్ఏలను నిలదీస్తున్న జనాలకైతే కొదవేలేదు.

అయితే, తమను నిలదీస్తున్న జనాలకు సమాధానాలు చెప్పాల్సిన మంత్రులు వాళ్ళపై ధైర్జన్యాలు చేస్తుండటం గమనార్హం.  మంత్రి సోమిరెడ్డి అయితే,  అందరి ముందు తనను నిలదీసిన ఓ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడి రూ. 3 వేల ఫైన్ కూడా వేయించారు. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అయితే, ఓ దళితునితో కాళ్ళ పట్టించుకున్నట్లు ప్రచారంలో ఉంది. అదేవిధంగా, ఎంఎల్ఏ యామినీబాల ను ఇళ్ళ పట్టాలు, నీళ్ళ గురించి ప్రశ్నించినందుకు ఆమె అనుచరులు పెద్ద వీరంగమే వేశారు. అంటే చంద్రబాబు ఒకటి తలచుకుంటే క్షేత్రస్ధాయిలో మరోటి జరుగుతుడటం

Follow Us:
Download App:
  • android
  • ios