ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గంటా నరహరి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. బెస్ట్ ఎంటర్ ప్రెన్యూర్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఆయన రాజంపేట స్థానం నుంచి లోక్ సభ బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ఏరియాకు చెందిన ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ గంటా నరహరి టీడీపీలో శుక్రవారం చేరారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కండువా కప్పి గంటాను పార్టీలో ఆయన ఆహ్వానించారు.
బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..
ఇండస్ట్రియలిస్ట్ గంటా నరహరి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు తీసుకున్నారు. బెంగుళూరు సెంటర్ పాయింట్ గా ఆయన తన బిజినెస్ ను రన్ చేస్తున్నారు. అనేక మందికి ఆయన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. గంట నరహరి దివంతగ నాయకుడు, ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు దగ్గరి బంధువుగా ఉన్నారు. అయితే ఆయన టీడీపీ నుంచి ఎంపీ బరిలో ఉంటారని తెలుస్తోంది. రాజంపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం కొనసాగుతోంది. ఈ చేరిక కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోనసీమలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తల్లీ కూతుళ్ళ సజీవదహనం.. హత్య చేసి తగలబెట్టారా? (వీడియో)
ఈ సందర్భంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. న్యూట్రల్ ఆలోచనలు కలిగిన వారందరినీ టీడీపీ ఆహ్వానిస్తోందని అన్నారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం అందరూ ముందుకు రావాలని కోరారు. టీడీపీలో చేరాలని సూచించారు. అనేక మంది ప్రముఖులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, అలాగే మేథావి వర్గం కూడా తమ పార్టీలో చేరాలని కోరారు. అనంతరం టీడీపీలో చేరిన గంటా నరహరి మాట్లాడారు. తాను పార్టీలో ఒక కార్యకర్తలా పని చేస్తానని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
