Asianet News TeluguAsianet News Telugu

మనుషులకే కాదు పరిశ్రమలకూ ప్రత్యేక ఆధార్: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

industrial aadhar... jagans govt imp decision
Author
Amaravathi, First Published Aug 13, 2020, 6:49 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు అరికట్టడంతో పాటు పరిశ్రమల  వివరాలు తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఓ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల వివరాలు సేకరించనున్నారు. సమగ్ర సర్వే కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

read more   అసంపూర్తే: రాష్ట్ర విభజనపై జగన్ సర్కార్ సంచలన వాదన

కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా  గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనున్నారు. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios