Asianet News TeluguAsianet News Telugu

ఎఫ్‌డీల స్కామ్: పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ వర్గాలు.. దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది.

ap govt officials complaint on fds scam
Author
Vijayawada, First Published Oct 14, 2021, 5:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ఐవోబీ, సప్తగిరి బ్యాంకుల్లో ఎఫ్‌డీలను సొంత అకౌంట్లకు బదిలీ చేశారు నిందితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు, అదనపు సమాచారం కోరారు. గల్లంతైన సొమ్ము చెల్లించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి ఆయా బ్యాంకు యాజమాన్యాలు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేస్తామని తెలిపింది. 

కాగా, తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన ముఠా ఏపీ ప్రభుత్వానికి చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని గుర్తించారు పోలీసులు. ఈ మేరకు ఏపీ అధికారులకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు.telugu akademi స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన saikumar ముఠా ap ware housing corporation,ap oil federation ల నుండి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ నుండి రూ. 9 కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్ నుండి రూ. 6 కోట్లను కొల్లగొట్టారని అధికారులు గుర్తించారు. గిడ్డంగుల శాఖకు రూ. 32 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి.అయితే bhavanipuram iobలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.9.60 లక్షలను నిందితులు డ్రా చేశారని ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ ఎండీ తెలిపారు. ఐఓబీ బ్యాంకుల్లోని 34 ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నగదు గల్లంతైందని గుర్తించామని ఎండీ చెప్పారు.

ALso Read:telugua akademi:సాయికుమార్ బ్యాచ్ ట్విస్ట్, ఏపీలో రూ. 15 కోట్లు స్వాహా

ఈ విషయమై బ్యాంకు అధికారులతో వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు మాట్లాడారు. దీంతో బ్యాంకు అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై విచారణ చేస్తున్నారు.తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని  వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ కావడానికి ముందే  నిధులు తరలించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ ప్రకటించారు.ఈ విషయమై అంతర్గత విచారణ చేస్తున్నామన్నారు. అంతేకాదు  నిధుల గల్లంతుపై  దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని  ఆయన తెలిపారు. తమకు తెలియకుండానే ఈ నిధులను డ్రా చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను ఈ విషయమై ఎండీ ప్రశ్నించారు. దీంతో ఈ విషయమై నిందితులకు బ్యాంకు ల నుండి ఎవరైనా సహకరించారా అనే కోణంలో బ్యాంకు అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios