భారత్ 12 స్వర్ణాలు, 5 వెండి, 12 కాంస్య పతకాలతో మొత్తం 29 పతకాలు సాధించటం విశేషం.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్పులో భారత్ చరిత్ర సృష్టించింది. గతంలో కన్నా మెరుగైన ప్రదర్శనతో పతకాల సాధనలో అగ్రస్ధానంలో నిలబడింది. ఆదివానం మన అథ్లెట్లు మరో ఐదు స్వర్ణపతకాల సాధించి అదిరిపోయే ముగింపు పలికారు. మొత్తం మీద భారత్ 12 స్వర్ణాలు, 5 వెండి, 12 కాంస్య పతకాలతో మొత్తం 29 పతకాలు సాధించటం విశేషం. ఇప్పటి వరకూ 1985లో జకార్తాలో జరిగిన ఛాంపియన్ షిప్పులో సాధించిన 22 పతకాలే బారత్ ఉత్తమ ప్రదర్శన.

పోటీల ఆఖరు రోజున 10 వేల మీటర్ల ఈవెంట్లలో భారత్ పసిడి పతకాలు సాధించింది. నీరజ్ చొప్రా జావెలిన్ త్రో, హెప్టాథ్లాన్ లో స్వప్న బర్మన్ స్వర్ణ పతకాలు అందుకున్నారు. పురుషులు, మహిళల 4x100 మీటర్ల రిలే రేసులో కూడా భారత్ స్వర్ణం సాధించింది. దాంతో పతకాల పట్టికలో అగ్రస్ధానం సాధ్యమైంది.