Independence Day: సోషల్ మీడియాలో సీఎం జగన్, వైఎస్ఆర్సీపీపై పేలుతున్న ట్రోల్స్.. ఆ పోస్టులో ఏముంది?
Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన పోస్టుపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి. సీఎం జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీపై ట్రోలర్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఘాటు విమర్శలు చేస్తున్నారు.
Trolls on CM Jagan and YSRCP: యావత్ భారతావని నేడు ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారత జాతికి విముక్తి కల్పించి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించిన భారత స్వాతంత్య్ర సమర యోధులను గుర్తుచేసుకుంటోంది. అయితే, ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన ఒక పోస్టుపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి. సీఎం జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీపై ట్రోలర్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఘాటు విమర్శలు చేస్తున్నారు. "స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంలో కూడా రాజకీయాల చేశారు.. పైత్యం బాగా నెత్తికి ఎక్కేసింది. ఇది దించకపోతే చాలా కష్టం, చాలా నష్టం కూడా.. చిన్నారికి కూడా రాజకీయ రంగు పులిమారు" అంటూ ఇలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలా విమర్శించడాని ఆ పోస్టులో ఏముంది..?
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ఆర్సీపీ ఒక ఫొటోను తన అధికారికి ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేసింది. అందులో "భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్య్ర సమరయోధులు వెలిబుచ్చిన ఆదర్శాలు సీఎం నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య ద్వారా సాధికారత, పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, స్థానిక పాలన, సమానత్వాన్ని పెంపొందించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కలిసికట్టుగా సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి, బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేద్దాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ పేర్కొంది. దీనికి ఒక ఫొటోను కలిపి పోస్టు చేసింది.
వైఎస్ఆర్సీపీ పోస్టు చేసిన ఫొటోలో స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక చిన్నారిని పైకి ఎత్తిపట్టుకోగా, చిన్నారి చేతిలో జెండా కనిపిస్తోంది. అయితే, ఇందులో భారత స్వాతంత్య్ర సమరయోధల కంటే సీఎం జగన్ చిత్రం పెద్దగా ఉంది. చిన్నారి వేసుకున్న డ్రెస్ కలర్స్ వైసీపీ జెండాను పోలివున్నాయి. భారతదేశ మ్యాప్ లో ఒక భాగంలో వైకాపా జెండా కలర్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి పలు అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పై ట్రోలర్స్ రెచ్చిపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు.