విజయవాడ:ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు  వద్ద గతంలో పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై ఐదో రోజు కూడ సోదాలు కొనసాగుతున్నాయి.

ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు.  ఐదు రోజుల క్రితం హైద్రాబాద్, విజయవాడలోని శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలను ప్రారంభించారు. సోమవారం నాడు కూడ విజయవాడలోని గాయత్రీనగర్‌లో అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.

శ్రీనివాస్ కు చెందిన లాకర్ల నుండి  ఐటీ అధికారులు కీలకపత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా  ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోమవారం నాడు సాయంత్రానికి ఈ సోదాలు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also read:చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ  అధికారులు ఈ నెల 6వ తేదీ నుండి  సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడు వద్ద శ్రీనివాస్ సుధీర్ఘ కాలం పాటు పనిచేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలైన తర్వాత శ్రీనివాస్ తన స్వంత డిపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్లారు. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో జీఏడీలో పనిచేస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలో భూ వ్యవహరాలకు సంబంధించిన విషయంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్టుగా ఐటీ అధికారులకు సమాచారం అందినట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఐటీ అధికారులు విచారణను చేపట్టారు. తమ వద్ద ఉన్న సమచారం ఆధారంగా ఐటీ అధికారులు శ్రీనివాస్ ను విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.