శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు.

శ్రీశైలం : Srisailam Templeఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే Devotees సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు Traditional dressల్లోనే వస్తేనే Sanctum sanctorumలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న వెల్లడించారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 24న ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించింది. డ్రోన్ విషయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి వద్ద డ్రోన్‌ను ఎగురుతుండ‌టం చూసి భ‌క్తులు భ‌యాందోళ‌న గురయ్యారు. 

ఆలయ పుష్కరిణి వద్ద భక్తులు స్నానం చేస్తూ పైన డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన భ‌ద్ర‌త సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఎగ‌ర‌వేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక ఆల‌య ప‌రిసరాల్లో నిషేధం.. భ‌క్తుల స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు .. డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల‌ు ఇద్ద‌రు గుజ‌రాత్ కు చెందిన వారిగా గుర్తించారు. అసలు వారు ఆల‌య ప‌రిసరాల్లో డ్రోన్ ఎందుకు ఎగరవేశారు? ఆలయం దగ్గరకు ఎలా తీసుకువచ్చారు? వారికి సహకరించిన వారెవ్వ‌రూ? అస‌లు ఆల‌య‌ సెక్యూరిటీ ఏం చేస్తున్న‌ది? వారు గుజరాత్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అన్న కోణంలో ఇద్దరు నిందితులను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

గతంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో డ్రోన్లు సంచరించడం కలకలం రేపింది. 2021, మే నెలలో దాదాపు నాలుగు రోజుల పాటు.. రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు ఎగ‌ర‌వేయడం అప్పట్లో కలకలం రేపింది. నాలుగు రోజులు శ్రీశైలం ఆలయం చుట్టూ తిరిగిన డ్రోన్లు ఆలయ అధికారులకు ఆందోళన కలిగించాయి. దీంతో ఆల‌య అధికారాలు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 

మ‌రో వైపు ప్ర‌తిప‌క్షాలు రంగంలో దిగాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని , బీజేపీ నేతలు ఈ పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆల‌య ప్ర‌తిష్ట‌, భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్రమాద‌ముంద‌ని అన్నారు. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతంలో,అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు డ్రోన్లని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు.