Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో మద్యం

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందింది

illegal liquor found in vijayawada kanaka durga trust board member car
Author
Vijayawada, First Published Sep 30, 2020, 5:18 PM IST

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 ఈ క్రమంలో జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ ఏపీ 16 బీవీ 5577 అనే నెంబర్ గల స్విఫ్ట్ కారులో అధికారులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

అయితే ఈ వ్యవహారం ఏపీ  రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు వరలక్ష్మీ భర్త, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మద్యం తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ రూ. 40 వేలు ఉంటుందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios