‘జరగబోయే అల్లర్లకు బాధ్యత తీసుకోవాలి’...ఇది వివాదాస్పద రచయిత ఐలయ్యకు పోలీసులు పంపిన నోటీసులోని ప్రధాన పాయింట్.

‘జరగబోయే అల్లర్లకు బాధ్యత తీసుకోవాలి’...ఇది వివాదాస్పద రచయిత ఐలయ్యకు పోలీసులు పంపిన నోటీసులోని ప్రధాన పాయింట్. నగరంలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహేంచేందుకు లేదని ఐలయ్యకు పోలీసులు స్పష్టం చేసారు. శనివారం విజయవాడలో కండె ఐలయ్యకు సన్మానం చేయాలని సిపిఐతో పాటు పలు సంఘాలు నిర్ణయించాయి. అయితే, పోలీసులు సన్మాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో సన్మాన కార్యక్రమాన్ని తెలుసుకున్న ఆర్యవైశ్య, బ్రాహ్మణ ఐక్య వేదిక కూడా పోటీ కార్యక్రమం జరుపుకునేందుకు పోలీసులను అనుమతి కోరింది.

రెండు వైపుల నుండి వచ్చిన అభ్యర్ధనలను పరిశీలించిన పోలీసులు రెండింటికి అనుమతి నిరాకరించారు. సరే, ఇదంతా చరిత్రనుకోండి. అయితే, తాజాగా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అనుమతి కోరుతూ పోలీసులను కలిసారు. తాము అడిగిన మైదానంలో కాకపోయినా వేరే చోటైనా అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఐక్య వేదిక కూడా మళ్ళీ యాక్టివ్ అయింది. దాంతో పోలీసులు ఐలయ్యకు నోటీసులు పంపారు.

సన్మాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఎక్కడా ఎటువంటి కార్యక్రమంలోనూ పాల్గొనేందుకు లేదని నోటీసులో తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమం ఏదైనా జరిగినపుడు అల్లర్లైతే అందుకు ఐలయ్యే బాద్యత వహించాలంటూ పోలీసులు నోటీసులో స్పష్టంగా పేర్కొనటం గమనార్హం. దాంతో శనివారం విజయవాడలో ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదు.