Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్లో 65 లక్షల పుస్తకాలు

మానవ వనరుల మంత్రిత్వ శాఖలోని నేషనల్ డిజిటల్ లైబ్రరీ చొరవ తీసుకుని ఐఐటి ఖరగ్ పూర్ సహకారంతో సుమారు 65 లక్షల పుస్తకాలను ఆన్ లైన్లో ఉంచటమంటే మామూలు విషయం కాదు. ఈ లైబ్రరీలో ప్రాధమిక విద్య నుండి పోస్టుగ్రాడ్యుయేట్ వరకూ దొరకని పుస్తకాలు, ఆడియో, వీడియోలు అంటూ ఉండవు.

iit kharagpur put 65 lakh books online

పుస్తక ప్రియులకు శుభవార్త. ఖరగ్పూర్ ఐఐటి, హెచ్ఆర్డీ సంయుక్తంగా 6.5 మిలియన్ పుస్తకాలను ఆన్ లైన్లో ఉంచింది. పుస్తకాలన్నింటినీ పుస్తక ప్రియులు సింగిల్ పోర్టల్లో చూడవచ్చు. అవసరమైతే కావాల్సిన పుస్తకాలను ఆన్ లైన్లో చదువుకోవటమే కాకుండా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. పోర్టల్లో టెక్స్ట్ పుస్తకాలేకాకుండా ఆడియో, వీడియోలను కూడా చూడవచ్చు.

మానవ వనరుల మంత్రిత్వ శాఖలోని నేషనల్ డిజిటల్ లైబ్రరీ చొరవ తీసుకుని ఐఐటి ఖరగ్ పూర్ సహకారంతో సుమారు 65 లక్షల పుస్తకాలను ఆన్ లైన్లో ఉంచటమంటే మామూలు విషయం కాదు. ఈ లైబ్రరీలో ప్రాధమిక విద్య నుండి పోస్టుగ్రాడ్యుయేట్ వరకూ దొరకని పుస్తకాలు, ఆడియో, వీడియోలు అంటూ ఉండవు. కావాల్సిన వారు http://ndl.iitkgp.ac.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని పుస్తకాలను చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఇన్ని లక్షల పుస్తకాలను ఆన్ లైన్లో ఉంచటం బహుశా దేశంలోనే ఇదే ప్రధమేమో.

Follow Us:
Download App:
  • android
  • ios