పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో పవన్ కల్యాణ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. 

మత ప్రాతిపదికన పేర్లు అడిగి మీర 26 మందిని అత్యంత కిరాతకంగా చంపినా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 
అలా మాట్లాడాలనుకుంటే వారు పాకిస్తాన్ కే వెళ్లిపోవాలని సూచించారు.

అసలు ఎవరినైనా చంపడం దారుణం. మరీ మత ప్రాతిపదికన చంపడం అత్యంత దారుణమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో పవన్ కల్యాణ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 

కశ్మీర్‌.. భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 

పహల్గాం దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమని స్పష్టం చేసిన భారత్‌.. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అప్పటినుంచి పాకిస్తాన్ మంత్రులు , నేతలతో పాటు అక్కడి మీడియా కూడా భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది.

భారత సైన్యానికి వ్యతిరేకంగా పలువురు పాక్ నేతలు, సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
ఈ నేపథ్యంలోనే పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో మాజీ పేసర్ షోయిబ్ అక్తర్ చానెల్ కూడా ఉంది.