మోహన్ బాబు లెక్కలో చంద్రబాబు, జగన్ ఏంటి ?

First Published 20, Jan 2018, 12:11 PM IST
If mohanbabu says ntr was the only honest leader in politics what about chandrababu and jagan
Highlights
  • ‘రాజకీయ నేతల్లో 95 శాతం రాస్కెల్సే’..‘ఎన్టీఆర్ ఒక్కరే నిజాయితీ కలిగిన నాయకుడు’..

‘రాజకీయ నేతల్లో 95 శాతం రాస్కెల్సే’..‘ఎన్టీఆర్ ఒక్కరే నిజాయితీ కలిగిన నాయకుడు’.. సినీనటుడు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ఇపుడు రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే, మోహన్ బాబు అవటానికి ఏపికి చెందిన వ్యక్తే అయినప్పటికీ దశాబ్దాలుగా హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. అందునా మోహన్ బాబు హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చయటంతో రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

మోహన్ బాబు లెక్క ప్రకారం ఎన్టీఆర్ ఒక్కరే నిజాయితీ కలిగిన నాయుకుడు. సరే, బాగానే ఉంది. మరి, ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్ మాటేమిటి ? వాళ్ళే కాదు వాళ్ళ కొడుకులు నారా లోకేష్, కెటిఆర్ తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏల సంగతేంటి? ఏపిలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మోహన్ బాబు చెప్పిన జాబితాలో ఉన్నారా?

అయితే, ఇక్కడే ప్రకటన ఇచ్చేముందు మోహన్ బాబు కాస్త జాగ్రత్త పడ్డారు. అదేంటంటే, 95 శాతం మంది నేతలు రాస్కెల్స్ అన్నారు. అంటే మిగిలిన 5 శాతంమంది సచ్చీలురన్న మాటే కదా? మరి, మోహన్ బాబు లెక్కలోకి వచ్చే ఆ 5 శాతం మంది సచ్చీలురెవరు ఎవరు? ఆ విషయంలో మోహన్ బాబు స్పష్టత ఇవ్వలేదు. దాంతో 95 శాతం జాబితాలోకి వచ్చే రాస్కెల్స్ ఎవరు? లేకపోతే 5 శాతం సచ్చీలురెవరు? అన్న విషయంపై  మోహన్ బాబు స్పష్టత ఇస్తే బాగుంటుంది.

ఎందుకంటే, త్వరలో ఎన్నికలు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల సంగతి ఎలాగున్నా రాబోయే ఎన్నికల్లో ఎటువంటి వారికి ఓట్లేయాలన్న విషయాన్ని జనాలు మోహన్ బాబు లెక్క ప్రకారం నిర్ణయించుకుంటారు

loader