అమరావతి: కోటి రూపాయాల జీతం వదులుకొని  ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో  సివిల్స్ పరీక్షలు రాసి తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంకు సాధించాడు పృథ్వీతేజ్. 

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలకు చెందిన శ్రీనివాసరావు కొడుకు పృథ్వితేజ్. పృథ్వితేజ్ తల్లి గృహిణి. పృథ్వితేజ్ కు సోదరి ఉంది. వీరిద్దరూ ఏడో తరగతి వరకు స్వంత ఊరిలోనే చదువుకొన్నారు. ఆ తర్వాత గుడివాడలోని విశ్వభారతి స్కూల్ లో  పదో తరగతి వరకు చదువుకొన్నారు. 

ఇంటర్మీడియట్ ను శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. 2011లో నిర్వహించిన ఐఐటీ జాతీయ స్థాయిలో ఆయనకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరాడు.

బీటెక్ పూర్తైన వెంటనే దక్షిణ కొరియాలోని సామ్ సంగ్ సంస్థలో ఏడాదికి కోటిరూపాయాల వేతనం పొందే ఉద్యోగంలో చేరాడు పృథ్వితేజ్. ఏడాదిన్నరపాటు ఆయన ఆ ఉద్యోగం చేశారు. అయితే ఈ ఉద్యోగం చేయడం కంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యమే పృథ్వితేజ్ కు చిన్ననాటి నుండి కల. 2016లో తాను పనిచేసే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఆ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఆయన 24వ ర్యాంకు సాధించాడు. 

ఐఎఎస్ అయ్యాక చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ఎనర్జీ విభాగంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆయన కడపలో  సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ వచ్చింది.

సీఎం జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.ఇదిలా ఉంటే పృథ్వీతేజ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిమాని. పృథ్వీతేజ్ ను పవన్ కళ్యాణ్ గతంలో సన్మానించారు.