Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీలు... కీలక శాఖల్లో జరిగిన మార్పులు చేర్పులివే...

ఆంధ్ర ప్రదేశ్ లో పలు కీలక శాఖల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది జగన్ సర్కార్. ఇందులోభాగంగానే భారీగా ఐఎఎస్ ల బదిలీలు చేపట్టింది.

IAS officers transferred in andhra pradesh
Author
Amaravati, First Published Nov 17, 2021, 8:50 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులను జగన్ సర్కార్ బదిలీచేసింది.  ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ IAS Transfers కు సంబంధించి అధికారిక ఉత్తర్వులను కూడా జారీచేసారు.

కేఎస్‌ జవహర్‌రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును, క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌ మీనా బదిలీ అయ్యారు. 

read more  నేటి ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా

ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్‌.సురేష్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి. చిన వీరభద్రుడు, సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా పి.రంజిత్‌ బాషా, చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి.నాగమణి, బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి.అర్జున్‌రావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదిలావుంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం మెప్పు కోసం ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని ప్రభుత్వాధికారులకు ధర్మాన సూచించారు. అధికారుల తీరువల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. 

పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరువల్ల వైసిపి ప్రజాప్రతినిధులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారన ధర్మాన ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయాలను తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

read more మన ప్రతిఅడుగు విప్లవాత్మకమే... ఈ కొత్త సాంప్రదాయం శ్రీకారం అందుకోసమే..: సీఎం జగన్

శ్రీకాకుళం జిల్లాలో అధికారులు ఉపాధిహామీ అధికారులు సక్రమంగా అమలుచేయడం లేదని... దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెలుతున్నారని పేర్కొన్నారు. పేద జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో సకాలంలో పనులు పూర్తికాకపోతే మరింత నష్టపోతామని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios