అసెంబ్లీ సమావేశానికి ముందు జరపాలని బావించిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నుండి ప్రకటన వెలువడింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశానికి ముందు నిర్వహించాలని నిర్ణయించిన క్యాబినెట్ భేటీ రద్దయ్యింది. ఇవాళ (17వ తేది బుధవారం) అమరావతి సచివాలయంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం తెలపలేదు.

బుధవారం ఉదయం 11గంటలకు సచివాలయంలో ap cabinet meeting వుంటుందని ముందు ప్రకటించారు. గురువారం ఒక్కరోజే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని జగన్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఎజెండా బిల్లులపై తీర్మానం కోసమే ఈ కేబినెట్ భేటీ జరపాలని భావించారు. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ ఈ సమావేశాన్ని వాయిదా వేసింది YSRCP Government. 

ఇదిలావుంటే ఇప్పటికే నవంబర్ 18న AP Assembly సమావేశం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది. బిఎసి సమావేశంలో అసెంబ్లీ పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుండి రావాల్సిన నిధులు తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

read more కుప్పంలో వైసిపిదే విజయం... చంద్రబాబుది ఆడలేక మద్దెల ఓడు: మంత్రి బొత్స సంచలనం

ఇక ఈ అసెంబ్లీ సమావేశంలో పలు కీలక ఆర్డినెన్స్ ల ఆమోదంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత జూలై నుండి ఇప్పటివరకు దాదాపుగా 14ఆర్డినెన్స్ లను వైసిపి ప్రభుత్వం జారీచేసింది... వీటన్నింటిని ఒకేరోజులో శాసనసభ, శాసన మండలిచేత ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

 ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు రానున్నాయి. ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ, ప్రైవేట్‌ వర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణలు ఆమోదానికి రానున్నాయి.

read more మన ప్రతిఅడుగు విప్లవాత్మకమే... ఈ కొత్త సాంప్రదాయం శ్రీకారం అందుకోసమే..: సీఎం జగన్

ఏపీ విద్యాశాఖ చట్ట సవరణ ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌,ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణ, చట్ట రెండో సవరణ ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయి. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ చట్ట సవరణ, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్ట సవరణ, సినిమా నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్సులు కూడా ఆమోదానికి రానున్నాయి.

ఇదిలా ఉంటే డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.