అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. తాను బీజేపీలోనే ఉన్నానని టీడీపీలో చేరడం లేదని ఆ విషయంలో తాను ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలిపారు. 

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను భేటీ కావడంతో తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందన్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత తాను ఢిల్లీ వెళ్లానని అయితే కొందరు మిత్రులు తనకు ఫోన్ చేసి సమాచారం అందించారన్నారు. 

తమ భేటీలో తన నియోజకవర్గంలోని కలిదిండి కళాశాల ఉద్యోగుల జీతాల బకాయిలపై చర్చించానని తెలిపారు. అలాగే నియోకవర్గం అభివృద్ధిపైనా సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. అంతేకానీ తమ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదన్నారు. 

ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీకి విధేయుడిగా ఉంటానని కామినేని స్పష్టం చేశారు. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా తనకు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. మంత్రి పదవి బీజేపీ ఇచ్చిన గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. 

అలాంటి పార్టీని వీడే ఆలోచన తనకు లేదన్నారు. మంత్రిగా నీతినిజాయితీలతో పనిచేసి తన బాధ్యతను నిర్వర్తించానని తెలిపారు. అటు ప్రభుత్వానికి, ఇటు బీజేపీకి మంచి పేరు తీసుకువచ్చానని గుర్తు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీకి కామినేని షాక్.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం