మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా..? అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. గత కొంతకాలంగా  కామినేని శ్రీనివాసరావు టీడీపీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాగా..సోమవారం రాజధాని అమరావతిలో.. ఏపీ సీఎం చంద్రబాబుని కామినేని కలిశారు.

వీరిద్దరి భేటీతో.. కామినేని టీడీపీలో చేరతారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా  గత కొంత కాలంగా కామినేని శ్రీనివాస్‌ బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగింది. దీంతో ఏపీలో టీడీపీతో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. 

దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ (వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి), మాణిక్యాల రావు (దేవదాయ శాఖ మంత్రి) తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.