నేనేలాంటి వాడినో దేశం మొత్తం తెలుసు: జడ్జితో చంద్రబాబు


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు సమయంలో జడ్జితో టీడీపీ చీఫ్ మాట్లాడారు.తనపై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు.

Iam not Corrupt Man Says Chandrababu to ACB Court Judge lns

విజయవాడ:ఈ వయస్సులో అక్రమ కేసులో తనను అరెస్ట్ చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు  ఏసీబీ కోర్టు  జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు.  తన గురించి దేశం మొత్తం తెలుసునన్నారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. ఈ సమయంలో చంద్రబాబు, ఏసీబీ కోర్టు జడ్జి మధ్య సంభాషణ జరిగింది.అంతకుముందు చంద్రబాబు న్యాయమూర్తితో తన అభిప్రాయాలను చెప్పారు. 45 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితం తనదని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనకు నోటీసులు ఇవ్వకుండానే  అరెస్ట్ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కేసులో తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు న్యాయమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందన్నారు.అన్యాయంగా తనను అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. ఇది తన బాధ, ఆవేదన,  ఆక్రందన అంటూ చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. 

also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: ఈ నెల 24 వరకు బాబు రిమాండ్ పొడిగింపు

తనపై  ఆరోపణలు మాత్రమేనని... ఈ ఆరోపణలు  నిర్ధారణ కాలేదని చంద్రబాబు గుర్తు చేశారు.చట్టానికి అందరూ సమానమేనని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని చంద్రబాబు చెప్పారు.ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుతో మాట్లాడారు. జైలులో సౌకర్యాలపై  జడ్జి  చంద్రబాబును అడిగారు.  జైలులో చంద్రబాబుకు కల్పిస్తున్న నివేదిక కోరారు. జైల్లో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.  

ఇది ట్రయల్ మాత్రమేనని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. మీ మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. దీన్ని మరోలా అర్ధం చేసుకోవద్దని జడ్జి  చంద్రబాబుకు చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు రాలేదని జడ్జి చెప్పారు.మీ మాటలను తాను అర్థం చేసుకోగలనని కోర్టు వ్యాఖ్యానించింది..కోర్టు కి ఒక విధానం ఉంటుంది... కానీ  ఈ విధానాలను  ఎవరూ మార్చలేరని న్యాయమూర్తి చెప్పారు.కోర్టు తన పరిధిలో పనిచేస్తుందన్నారు.  జ్యూడిషియల్ కస్టడీలో ఇబ్బందులుంటే చెప్పాలని జడ్జి కోరారు.మానసికంగా బాధ పడొద్దని కోర్టు బాబుకు సూచించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios