నేను దోచుకోను.. మరెవరినీ దోచుకోనివ్వను - ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
MP Kesineni Nani : నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని విజయవాడ ఎంపీ కాశినేని నాని అన్నారు. డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాకూడదని ఆయన సూచించారు.
MP Kesineni Nani : టీడీపీ నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి తాను ఓ కాపల కుక్కనని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపాదన కోసం ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదనిఅన్నారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందని తెలిపారు.
భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం..
తాను దోచుకోనని, అలాగే మరెవరినీ దోచుకోనివ్వనని కేశినేని నాని అన్నారు. అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి శ్వేత పోటీ చేస్తుందని ప్రచారం సాగుతోందని అన్నారు. కానీ తాను, తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను తాను సహించబోనని తెలిపారు.
న్యూ ఇయర్ రోజు జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..
అలాంటి అక్రమార్కులతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కేశినేని తెలిపారు. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే తాను బాధ్యత తీసుకున్నానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని వెన్నుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాల్ మనీ, గుడి దగ్గర కొబ్బరి చిప్పలు అమ్ముకునే వారిని వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఆదరించబోరని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి తాను ఓ కాపలా కుక్కనని అన్నారు. దోచుకొని.. దాచుకునే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.